Homeటాప్ స్టోరీస్పీఎస్‌పీకే 29 స్టైలిష్ డైరెక్ట‌ర్‌తో!

పీఎస్‌పీకే 29 స్టైలిష్ డైరెక్ట‌ర్‌తో!

Stylish director Surendar reddy to direct PSPK29
Stylish director Surendar reddy to direct PSPK29

రెండేళ్ల విరామం త‌రువాత మళ్లీ సినిమాల విష‌యంలో స్పీడు పెంచారు ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్‌. వ‌రుస చిత్రాల్ని ప్ర‌క‌టిస్తూ షాకుల‌మీద షాకులిస్తున్నారు.  దిల్‌రాజు, బోనీక‌పూర్ నిర్మిస్తున్న `వ‌కీల్ సాబ్‌` చిత్రంతో జోరు పెంచిన ప‌వ‌ర్‌స్టార్ ఆ వెంట‌నే జాగ‌ర్ల‌మూడి క్రిష్‌తో ఓ పాన్ ఇండియా స్థాయి చిత్రాన్ని చేస్తున్న‌రు. బందిపోటు దొంగ‌గా ఇందులో ఆయ‌న క‌నిపించ‌బోతున్నారు.

ఇదిలా వుంటే ఈ మూవీతో పాటు `గ‌బ్బ‌ర్‌సింగ్‌` కాంబినేష‌న్‌లో హ‌రీష్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ భారీ చిత్రానికి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేశారు. మైత్రీ మూవీమేక‌ర్స్ అత్యంత భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని ప్లాన్ చేస్తోంది. ప‌వ‌న్ పుట్టిన రోజు రిలీజ్ చేసిన ఈ చిత్ర కాన్సెప్ట్ పోస్ట‌ర్ సినిమాపై అంచ‌నాల‌ని పెంచేస్తోంది. స‌ర్ధార్ వ‌ల్ల‌భాయ్ ప‌టేల్‌, సుభాష్ చంద్ర‌బోస్ ల ఫొటోల‌ని, హ‌ర్లే డేవిడ్‌స‌న్ బైక్‌, గాజుల స‌త్య‌నారాయ‌ణ పెద్ద బాల‌శిక్ష‌, ఓ రోజ్ ఫ్ల‌వ‌ర్ కాన్సెప్ట్ పోస్ట‌ర్‌లో వుండ‌టంతో ఈ మూవీ ఎంట‌ర్‌టైన్‌మెంట్‌తో పాటు ఓ కీల‌క‌మైన అంశాన్ని చ‌ర్చించ‌బోతున్న‌ట్టుగా స్ప‌ష్ట‌మైంది.

- Advertisement -

వ‌రుస క్రేజీ ప్రాజెక్ట్‌ల‌తో పాటు తాజాగా మ‌రో ప్రాజెక్ట్‌ని ప‌వ‌న్ అంగీక‌రించారు. రామ్ తాళ్లూరి ఈ చిత్రాన్ని నిర్మించ‌బోతున్నార‌ని ఇటీవ‌ల వార్త‌లు వ‌చ్చాయి. అయితే ఈ చిత్రానికి స్టైలిష్ డైరెక్ట‌ర్ సురేంద‌ర్‌రెడ్డి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తార‌ని తాజాగా వెల్ల‌డించారు. ఈ మూవీ ఓ రేంజ్‌లో వుండ‌బోతోంద‌ని ఫిల్మ్ స‌ర్కిల్స్‌లో వినిపిస్తోంది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All