
తొలి స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన చిత్రం `సైరా నరసింహారెడ్డి`. మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన ఈ చిత్రం సంచలన విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని సురేందర్‌రెడ్డి దర్శకత్వం వహించారు. ఈ సినిమా తరువాత ఆయన ఎవరితో సినిమా చేయబోతుతున్నారు? .. ఆ హీరో ఎవరు? అన్నది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
కొన్ని రోజులుగా సైలెంట్‌గా వున్న సురేందర్‌రెడ్డి ప్రస్తుతం ఓ యంగ్ హీరోకు స్క్రిప్ట్‌ని సిద్ధం చేస్తున్నాడని తెలిసింది. ఆ హీరో మరెవరో కాదు అఖిల్ అక్కినేని. ఇప్పటికే అఖిల్‌కి లైన్ వినిపించారని, `రేసుగుర్రం` తరహాలో ఈ సినిమా వుంటుందని చిత్ర వర్గాల సమాచారం.
సాదారణంగా ఒకరు సిద్ధం చేసిన కథకి స్క్రీన్‌ప్లేని అందించడం సురేందర్‌రెడ్డి కి అలవాటు.. కానీ తొలిసారి ఈ సినిమా కోసం స్క్రిప్ట్ రాస్తున్నాడట. దీంతో ఈ మూవీ స్పెషల్‌గా వుంటుందని ఇండస్ట్రీ వర్గాల టాక్.