Homeటాప్ స్టోరీస్డాన్స్ బాగుంది..! డైరెక్షన్ తగ్గింది

డాన్స్ బాగుంది..! డైరెక్షన్ తగ్గింది

డాన్స్ బాగుంది..! డైరెక్షన్ తగ్గింది.
డాన్స్ బాగుంది..! డైరెక్షన్ తగ్గింది.

ఇండియా పాకిస్తాన్ అనేవి రెండు దేశాలు.ఈ రెండు దేశాల మధ్య రాజకీయ పరంగా ఎన్నో గొడవలు ఉన్నప్పటికీ, కొంతమంది స్వార్థపరులు ఓట్ల కోసం అదే విధంగా మరి కొంతమంది కార్పొరేటర్ దృష్టశక్తులు డబ్బుల కోసం ఏదో శత్రుత్వం ఉన్నట్లు సృష్టించి తమ పబ్బం గడుపుకుంటున్నారు. అలా కొన్ని దశాబ్దాలుగా కొంతమంది మూక సాగిస్తున్న వికృత క్రీడ ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. ఒక వ్యక్తి పాకిస్తాన్ వాడు అయినంత మాత్రాన, వాళ్ళు భారత దేశ ప్రజలకు ఏదో ద్రోహం చేశారు.! అన్న స్థాయిలో ప్రజల మనసులను కలుషితం చేశారు. కానీ ద్రోహం చేసింది అప్పటి పాలకులు ప్రజలు మాత్రం కాదు.

అలాంటి ఇండియా-పాకిస్తాన్ సెంటిమెంట్ ని మళ్ళీ వాడుకుంటూ దర్శకుడు రెమో డిసౌజా తెరకెక్కించిన చిత్రం స్ట్రీట్ డాన్సర్. ఎప్పటిలాగే ఏబిసిడి మరియు ఏబిసిడి టు 2 సినిమాల మాదిరిగా ఇది కూడా నృత్య ప్రధాన చిత్రం. ఏదో ఒక పెద్ద డాన్స్ పోటీలు జరుగుతూ ఉండటం, దానికి హీరో పేదరికం నుంచి వచ్చి అక్కడ విజయం సాధించటం, విజయం సాధించడానికి అతనికి కావాలని కొంతమంది అడ్డంకులు సృష్టించడం, వాటిని ఒక గురువు సహాయంతో హీరో దాటి విజయం సాధించడం అనేది పాత ఫార్ములానే. కానీ ఇప్పుడు దర్శకుడు ఇండియా పాకిస్తాన్ మధ్య ఉన్న సామాజిక సమస్యను కథాంశంగా తీసుకున్నాడు. ఈ సినిమాలో వరుణ్ ధావన్ ఇండియాకు చెందిన డాన్సర్ గా, అదేవిధంగా హీరోయిన్ శ్రద్ధా కపూర్ పాకిస్థాన్ కి చెందిన డాన్సర్ గా నటించారు. మరొక కీలకమైన పాత్రలో బాలీవుడ్ నటి నోరా ఫతేహి కూడా నటించింది. కథను మలుపు తిప్పే రాంప్రసాద్ పాత్రలో భారతదేశం గర్వించదగ్గ కొరియోగ్రాఫర్ మరియు ప్రస్తుత దర్శకుడు ప్రభుదేవా కనిపిస్తారు.

- Advertisement -

అయితే ఈ సినిమాలో ప్రథమార్థంలో వచ్చే డాన్స్ సన్నివేశాలు ప్రేక్షకులను ఉర్రూతలూగించినా, ద్వితీయార్ధం నుంచి అసలు కథ మొదలైనప్పుడు ఎక్కువ శాతం మంది ప్రేక్షకులు ఈ కథలో చూపించిన ఎమోషన్ కి కనెక్ట్ అవ్వలేదని టాక్ వినిపిస్తోంది. ఎందుకంటే గ్లామర్ ఎప్పుడూ కథను డామినేట్ చేయకూడదు. ఈ సినిమాలో అదే జరిగింది ప్రతి సినిమాలో ప్రతీ పాత్రకు ఒక పరిమితి ఉంటుంది. ఆ పరిమితి దాటి ఆ పాత్ర ప్రవర్తిస్తే, ఆ సన్నివేశం వరకు సినిమా బాగుంది.. అని అనిపించినా, సినిమా మొత్తం చూసినప్పుడు మాత్రం మనకి ఏదో తగ్గింది అనో, లేకపోతే సినిమా బాగా లేదనే అనిపిస్తుంది. విశ్లేషకుల, విమర్శకుల వాదన ఎలా ఉన్నప్పటికీ, ఒక మంచి యూత్ ఫుల్ ఎంటర్టైనర్ చూడాలి..! అనుకున్న ప్రస్తుత ప్రేక్షకులకు స్ట్రీట్ డాన్స్ 3d మంచి ఆప్షన్. ఇక చూసేయండి.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All