Homeటాప్ స్టోరీస్ప్రభుదేవా “ముక్కాబులా” మ్యాజిక్ ఈజ్ బ్యాక్

ప్రభుదేవా “ముక్కాబులా” మ్యాజిక్ ఈజ్ బ్యాక్

Prabhudeva energy in street dancer song
Prabhudeva energy in street dancer song

ప్రభుదేవా కొరియోగ్రాఫర్ & దర్శకుడిగా మాత్రమే కాదు, నటుడిగా కూడా ఎన్నో హిట్ సినిమాలు చేసారు. జెంటిల్ మెన్ చిత్రంలో స్పెషల్ సాంగ్ చేసిన తరువాత డైరెక్టర్ శంకర్ ప్రభుతో ప్రేమికుడు అనే భారీ యాక్షన్ బ్యాక్ డ్రాప్ లవ్ స్టోరీ చేసారు. ఆరోజుల్లో ఒక కొత్త హీరోతో అది ఒక సాహసం. ఆ తర్వాత కూడా ప్రభుదేవా హీరోగా కంటిన్యూ అయ్యారు. హిందీలో ABCD & ABCD 2 సినిమాలు చేసారు. ఇప్పుడు ఆ సినిమాల దర్శకుడు, స్వతహాగా కొరియోగ్రాఫర్ రేమో డిసౌజా డైరెక్షన్ లో మళ్ళీ డ్యాన్స్ బ్యాక్ డ్రాప్ లో స్ట్రీట్ డ్యాన్సర్ 3డి సినిమా రాబోతోంది, ఇప్పటికే వచ్చిన సినిమా ట్రైలర్ అందరినీ ఆకట్టుకుంది.

ఇండియా & పాకిస్తాన్ అక్రమ వలసదారుల నేపధ్యంలో వస్తున్న ఈ సినిమాకు సంబంధించి ఇప్పుడు ఒక పాటను రిలీజ్ చేసారు. గతంలో ప్రేమికుడు సినిమాలో ప్రభుదేవా ల్యాండ్ మార్క్ సాంగ్ “ముక్కాబులా” సాంగ్ ని రీమిక్స్ చేసి రిలీజ్ చేసారు. ఈ సాంగ్ లో ప్రభుదేవా తోపాటు వరుణ్ ధావన్, శ్రద్ధా కపూర్ కూడా కనిపిస్తున్నారు. కానీ పాట చూసిన వాళ్ళు అందరూ “ప్రభు సార్…. ఎనర్జీ గ్రేట్” అని పొగడ్తలు కురిపిస్తున్నారు. ఇన్నేళ్ళ తరువాత ప్రభుదేవా మళ్ళీ ఆరోజుల్లో ప్రభుదేవాని గుర్తు చేస్తున్నారు. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా  జనవరి 24 వ తేదీ 2020 ప్రధాన భాషల్లో విడుదల అవుతోంది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All