Homeటాప్ స్టోరీస్కరోనా పై అవగాహన దిశగా సినీ నటీనటుల మరో షార్ట్ ఫిల్మ్

కరోనా పై అవగాహన దిశగా సినీ నటీనటుల మరో షార్ట్ ఫిల్మ్

కరోనా పై అవగాహన దిశగా సినీ నటీనటుల మరో షార్ట్ ఫిల్మ్
కరోనా పై అవగాహన దిశగా సినీ నటీనటుల మరో షార్ట్ ఫిల్మ్

భారతదేశంలో కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి ఈనెల అనగా ఏప్రిల్ 30వ తేదీ వరకు లాక్ డౌన్ కొనసాగించనున్నట్లు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే ప్రకటించాయి. ఈ నేపథ్యంలో ప్రజలందరినీ అత్యవసరం అయితే తప్ప బయటకు రావద్దని ఇంటి వద్దే గడపాలని అందరూ సూచిస్తున్నారు. ప్రజలందరికీ కరోనా వైరస్ పై అవగాహన కలిగించడానికి ఇప్పటికే వెండితెర మరియు బుల్లితెర లు చెందిన అందరూ వివిధ నటీనటులు లఘు చిత్రాలు రూపొందిస్తూ అవగాహన కల్పిస్తున్నారు. ఇక ఇప్పుడు పద్మభూషణ్ డాక్టర్ ఎస్పీ బాలసుబ్రమణ్యం గారు మరియు డాక్టర్ పరుచూరి గోపాల కృష్ణ గారి సారథ్యంలో ప్రముఖ బుల్లి తెర తారలు యమున,శుభలేఖ సుధాకర్, సమీర్, జాకీ, అర్చన, యాంకర్ రవి, అలీ రెజా, ఆసు రెడ్డి ప్రియాంక ఇలా దాదాపు 34 మంది దక్షిణ భారతదేశ నటీనటులు వారి వారి ఇళ్లలో నుంచి 29 మొబైల్ ఫోన్స్ ద్వారా వారి ఇళ్ళల్లో దాదాపు ఐదు భాషలలో ఒక లఘు చిత్రాన్ని తీసారు.

రవి కిరణ్ ఈ లఘు చిత్రాన్ని రూపొందించారు. “లాక్ డౌన్ వల్ల ఇంటి వద్దే ఉండిపోవాల్సి వస్తోంది..” అన్న ఆలోచన కాకుండా కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయం గడిపే అవకాశం దక్కిందని సంతోషించాలనీ.., మన కుటుంబ సభ్యులతోను మరియు బంధుమిత్రులతో స్నేహితులతో ఈ సమయాన్ని సంతోషంగా గడపాలనీ… వారికి మరింత ప్రేమను పంచుతూ భవిష్యత్తు పట్ల పాజిటివ్ దృక్పథంతో ఉండాలని ఈ షార్ట్ ఫిలిం ద్వారా సందేశం ఇచ్చారు.ఇక ప్రస్తుతం ఈ షార్ట్ ఫిల్మ్ ను త్వరలో డిజిటల్ మాధ్యమాలలో అందరికీ చేరే విధంగా రిలీజ్ చేయబోతున్నారు.

- Advertisement -

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All