
`మహానటి` వంటి సంచలన చిత్రం తరువాత నాగ్ అశ్విన్ పాన్ ఇండియా స్థాయికి మించి భారీ సైన్స్ ఫిక్షన్‌ని తెరకెక్కించనున్న విషయం తెలిసిందే. వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై సి. అశ్వనీదత్ అత్యంత భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు. ఇప్పటికే ఈ చిత్రంలో ప్రభాస్‌కు జోడీగా బాలీవుడ్ క్రేజీ హీరోయిన్ దీపికా పదుకునే ని ఎంపిక చేశారు. లెజండరీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు ఈ చిత్రానికి మెంటర్‌గా వర్క్ చేయబోతున్నారు.
ఈ విషయాన్ని కూడా మేకర్స్ సోమవారం ప్రకటించారు. ఇదిలా వుంటే ఈ మూవీ సెట్స్‌పైకి రావడానికి మరింత సమయం పడుతుంది కాబట్టి ఈలోగా ఓ ఎక్స్‌పెరిమెంటల్ ఫిల్మ్‌ని నాగ్ అశ్విన్ చేస్తున్నట్టు తెలిసింది. ఈ వెబ్ ఫిల్మ్‌ని నాగ్ అశ్విన్ నెట్‌ఫ్లిక్స్ కోసం చేస్తున్నారట. ఇందులో క్రేజీ హీరోయిన్ శృతిహాసన్ నటిస్తోంది. హైదరాబాద్‌లోని సారథీ స్టూడియోస్‌లో షూటింగ్ మొదలుపెట్టారు.
ప్రత్యేకంగా వేసిన సెట్‌లో షూటింగ్ చేస్తున్నారు. 30 నిమిషాల పాటు ప్రయోగాత్మకంగా సాగే ఈ వెబ్ మూవీలో శృతిహాసన్ పాత్ర కూడా చాలా కొత్తగా వుంటుందని తెలిసింది. శృతిహాసన్ ప్రస్తుతం `క్రాక్` చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. రవితేజ నటిస్తున్న ఈ మూవీ త్వరలోనే విడుదల కాబోతంది.