Homeటాప్ స్టోరీస్ప‌బ్లిక్‌గ్గా లిప్ లాక్ చేసేసింది!

ప‌బ్లిక్‌గ్గా లిప్ లాక్ చేసేసింది!

ప‌బ్లిక్‌గ్గా లిప్ లాక్ చేసేసింది!
ప‌బ్లిక్‌గ్గా లిప్ లాక్ చేసేసింది!

హీరోయిన్ శ్రియా శ‌ర‌న్ ప‌బ్లిగ్గా లిప్ లాక్ చేసి షాకిచ్చింది. ర‌ష్యాకు చెందిన యువ వ్యాపార వేత్త ఆండ్రూ కోశ్చివ్‌ని వివాహం చేసుకున్న విష‌యం తెలిసిందే. లాక్‌డౌన్ స‌మ‌యంలో భ‌ర్త‌తో క‌లిసి స్పెయిన్‌లో చిక్కుకుపోయిన శ్రియ ప్ర‌తీ రోజు త‌న దైనందిన కార్య‌క్ర‌మాల‌కు సంబంధించిన ఫొటోల‌ని, వీడియోల‌ని షేర్ చేస్తూ నిత్యం అభిమానుల‌తో ట‌చ్‌లో వుంటూ వ‌చ్చింది.

త‌న భ‌ర్త‌తో క‌లిసి వ‌ర్క‌వుట్‌లు చేస్తున్న వీడియోల‌ని షేర్ చేసిన శ్రియ తాజాగా త‌న భ‌ర్త‌ని ప‌బ్లిక్‌గా కిస్ చేసింది. భ‌ర్త ఆండ్రూ కోశ్చివ్‌ని లిప్ లాక్ చేస్తున్న ఫొటోని సోష‌ల్ మీడియాలో షేర్ చేసింది. ఆ ఫొటోకు `సెండింగ్ యు ఆల్ కిస్సెస్ అండ్ హ‌గ్స్‌` అని క్యాప్ష‌న్‌ని జ‌త చేసింది. ప్ర‌స్తుతం ఈ ఫొటో సోష‌ల్ మీడియాలో తెర వైర‌ల్ అవుతోంది.

- Advertisement -

ఆండ్రూ కోశ్చివ్‌ని శ్రియ 2018లో ప్రేమించి పెళ్లి చేసుకుంది. భ‌ర్త‌తో క‌లిసి 2018 నుంచి స్పెయిన్‌లో వుంటోంది. ప్ర‌స్తుతం ముంబైకి మ‌కాం మార్చిన శ్రియ `ఆర్ ఆర్ ఆర్‌`లో అతిథి పాత్ర‌లో న‌టిస్తోంది. ఈ మూవీతో పాటు ప్ర‌ధాన పాత్ర‌లో `గ‌మ‌నం` చిత్రంలో ఓ సాధార‌ణ గృహిణిగా క‌నిపించ‌బోతోంది. దాదాపు ఐదు భాష‌ల్లో ఏక కాలంలో విడుద‌ల కాబోతోంది.

 

View this post on Instagram

 

A post shared by Shriya Saran (@shriya_saran1109)

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All