Homeటాప్ స్టోరీస్రియ‌లిస్టిక్ క‌థ‌నంతో శ్రియ `గ‌మ‌నం`!

రియ‌లిస్టిక్ క‌థ‌నంతో శ్రియ `గ‌మ‌నం`!

రియ‌లిస్టిక్ క‌థ‌నంతో శ్రియ `గ‌మ‌నం`!
రియ‌లిస్టిక్ క‌థ‌నంతో శ్రియ `గ‌మ‌నం`!

శ్రియ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తున్న చిత్రం `గ‌మ‌నం`. సుజ‌నా రావు ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. తెలుగు, త‌మిళ‌, మ‌ల‌యాళ‌, క‌న్న‌డ‌, హీందీ భాష‌ల్లో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. `ట్యాక్సీవాలా` ఫేమ్ ప్రియాంక జ‌వాల్క‌ర్‌, శివ కందుకూరి ఓ జంట‌గా న‌టిస్తున్నారు. అతిథి పాత్ర‌లో నిత్యామీన‌న్ క‌నిపిస్తోంది. మూడు క‌థ‌ల స‌మాహారంగా ఈ మూవీని రూపొందించారు. స‌హ‌జ‌త్వానికి ద‌గ్గ‌ర‌గా క‌థ‌, క‌థ‌నం, పాత్ర‌లున్నాయి.

ఈ చిత్రానికి సంబంధించిన ట్రైల‌ర్‌ని స్టార్ హీరో ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ బుధ‌వారం రిలీజ్ చేశారు. త‌మిళంలో జ‌యం ర‌‌వి, క‌న్న‌డంలో శివ‌రాజ్ కుమార్‌, మ‌ల‌యాళంలో ఫ‌ర్హ‌ద్ ఫాజిల్‌, హిందీలో సోనుసుద్ రిలీజ్ చేశారు. స్ల‌మ్ ఏరియాలో వుండే చెవిటి యువ‌తిగా శ్రియ పాత్ర కొత్త‌గా వుంది. ఇద్ద‌రు పిల్ల‌ల‌తో అవ‌స్థ‌లు ప‌డే మ‌హిళ‌గా శ్రియ పాత్ర క‌నిపిస్తోంది. ప్రేమ జంట‌గా శివ కందుకూరి, ప్రియాంక జ‌వాల్క‌ర్ న‌టించారు. వీధి అనాథ‌లుగా `డ్రామా జూనియ‌ర్స్‌` పిల్ల‌లు క‌నిపించారు. శి కందుకూరికి క్రికెట‌ర్ అవ్వాల‌నేది ల‌క్ష్యం. వీధి పిల్ల‌ల‌కు పుట్టిన రోజు జ‌రుపుకోవాల‌న్న‌ది క‌ల‌.

- Advertisement -

ఈ మూడు జంట‌ల జీవితాల్లో హైద‌రాబాద్ వ‌ర‌ద‌లు ఎలాంటి బీభ‌త్సాన్ని సృష్టించాయి? ‌చివ‌రికి వీరి జీవితాలు ఏ తీరాన్ని చేరాయి అన్న‌ది ఆస‌క్తిక‌రంగా వుంది. నిత్యామీన‌న్ సంగీత కారినిగా క‌నిపించింది. ఇళ‌య‌రాజా సంగీతం.. హైద‌రాబాద్ వ‌ర‌ద‌ల్ని క‌ళ్ల‌కు క‌ట్టి చూనించిన జ్ఞాన‌శేఖ‌ర్ ఫొటోగ్ర‌ఫీ.. సాయి మాధ‌వ్ బుర్రా మాట‌లు.. శ్రియ న‌ట‌న ఈ చిత్రానికి హైలైట్‌గా నిలిచేలా వున్నాయి. అత్యంత రియ‌లిస్టివ్ వేలో సుజ‌నా రావు ఈ చిత్రాన్ని తెర‌కెక్కించారు. ట్రైల‌ర్ సినిమాపై మ‌రింత ఆస‌క్తిని రేకెత్తిస్తోంది.

YouTube video

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All