Homeటాప్ స్టోరీస్సినిమా రిలీజ్ ముంగిట ఎమోషనల్ అయిన శ్రీనివాసరెడ్డి

సినిమా రిలీజ్ ముంగిట ఎమోషనల్ అయిన శ్రీనివాసరెడ్డి

సినిమా రిలీజ్ ముంగిట ఎమోషనల్ అయిన శ్రీనివాసరెడ్డి
సినిమా రిలీజ్ ముంగిట ఎమోషనల్ అయిన శ్రీనివాసరెడ్డి

కమెడియన్లు హీరోలు అవ్వడం పరిపాటి. ప్రతి కమెడియన్ కూడా తన కెరీర్ లో ఏదొక సారి హీరోగా మారక తప్పదు. అది టాలీవుడ్ లో అనాదిగా వస్తోన్న ఆచారం. రాజబాబు, రేలంగి కాలం నాటి నుండి ఇప్పటి సప్తగిరి కాలం వరకూ కామెడియన్లందరూ హీరోలుగా మారారు. కొందరు సీరియస్ గా హీరోలుగా మారితే మరికొందరేమో ఏదో టైం పాస్ అన్నట్లు చేసారు. సునీల్ లాంటి వాళ్ళు హీరోని సీరియస్ గా తీసుకుని కామెడీ పాత్రలకు దూరమై మళ్ళీ ఇప్పుడు కమెడియన్ గా మారిపోయాడు. సప్తగిరి లాంటి వాళ్ళు అటు కమెడియన్ గా చేస్తూనే అవకాశం వచ్చినప్పుడు హీరోలుగా ట్రై చేస్తున్నారు. ఇక హీరోగానే కాకుండా ఆ కమెడియన్లు దర్శకత్వం వైపు అడుగులు వేయడం మనం చూసాం. ఏవీఎస్, వెన్నెల కిషోర్ వంటి వారు డైరెక్షన్ చేసి చేతులు కాల్చుకున్నారు కూడా.

ఇప్పుడు పాపులర్ కమెడియన్ శ్రీనివాసరెడ్డి హీరోగా చేయడమే కాకుండా డైరెక్షన్, ప్రొడ్యూసర్ గా మారి చేసిన సినిమా భాగ్యనగర వీధుల్లో గమ్మత్తు. ఎప్పటినుండో నిర్మాతగా మారి ఒక చిన్న సినిమాను నిర్మించాలని అనుకున్నానని శ్రీనివాసరెడ్డి చెప్పాడు. కమెడియన్ల గ్రూప్ అంతా కలిసి పెట్టుకున్న ఫ్లైయింగ్ కలర్స్ గ్రూప్ నే శ్రీనివాసరెడ్డి బ్యానర్ పేరుగా పెట్టి ఈ సినిమాను నిర్మించాడు. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఈ నెల 6న విడుదలకు సిద్ధంగా ఉంది.

- Advertisement -

అయితే మొదట ఈ సినిమాకు వేరే దర్శకుడినే పెట్టుకుందామని అనుకున్నాడట శ్రీనివాసరెడ్డి. అయితే నిర్మాత తానే కాబట్టి ఎలాగు దగ్గరుండి పర్యవేక్షించాలి. అందుకే దర్శకుడిగా కూడా మారాడట. ఎప్పటినుండో శ్రీనివాసరెడ్డికి డైరెక్షన్ చేయాలన్న కోరిక ఉండేదిట. అది ఈ విధంగా తీరినందుకు చాలా హ్యాపీగా ఉన్నానని చెబుతున్నాడు శ్రీనివాసరెడ్డి. భాగ్యనగర వీధుల్లో గమ్మత్తు తన తండ్రి కూడా ఒక చిన్న పాత్ర వేశారని తెలియజేసాడు. అసలు ఆయన మీదే తొలి షాట్ ను తీశానని, చాలా సంతృప్తిగా అనిపించిందని, కానీ సినిమా రిలీజ్ టైమ్ కు ఆయన లేకపోవడం నిజంగా బాధాకరంగా ఉందని ఆవేదన వ్యక్తం చేసాడు శ్రీనివాసరెడ్డి. ట్రైలర్ చూస్తుంటే ఆసక్తికరంగానే ఉంది మరి. విట్టీ కామెడీ జోనర్ లో తెరకెక్కిన ఈ సినిమాలో టాలీవుడ్ లోని దాదాపు కమెడియన్లు అందరూ తలా పాత్రా వేశారు. మరి దర్శకుడిగా, నిర్మాతగా, హీరోగా ఇన్ని రకాలు పాత్రలు వేసిన శ్రీనివాసరెడ్డి ఎలాంటి ఫలితం అందుకోనున్నాడో చూడాలి.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All