
హాస్య కథానాయకులలో తనకంటూ మంచి గుర్తింపు ఉన్న నటుడు ‘శ్రీనివాస్ రెడ్డి‘. ఇప్పటి వరకు చేసిన సినిమాలు బాగా ప్రజాధారణ పొందాయి. హాస్య కథనాయకుడిగా కొనసాగుతూనే పలు సినిమాల్లో కూడా కథనాయకుడిగా చేసి ఇతరులు అనగా హాస్య కథానాయకులునుండి కథానాయకులు అయిన వారికంటే మంచిగా చేసాడు అని పేరు సంపాదించాడు.
ఈ రోజుల్లో ముఖ్యమైనది అలాంటి పేరు మాత్రమే… ఎందుకంటే కొంతమంది డబ్బు పలుకుబడి ఉండి సినిమాలు ఆడుతాయా అని కూడా ఆలోచించకుండా కేవలం వారికోసం మాత్రమే సినిమాలు చేసుకుంటున్న ఈ రోజుల్లో… జనాల మీద అలా ప్రభావం పడకుండా తగిన జాగ్రత్తగా పడుతూ సినిమాలు, సినిమాలలో పాత్రలు చేస్తారు హాస్య కథానాయకుడు శ్రీనివాస్ రెడ్డి.
తను కథానాయకుడిగా నటించిన సినిమాలు బాగా జనాలకి దగ్గర అయ్యాయి.’ఆనందో బ్రహ్మ‘, ‘గీతాంజలి’ సినిమాలు చేసారు. వాటికి మంచి పేరు వచ్చింది. తర్వాత చేసిన ‘జంబలకిడి పంబ’ సినిమా మాత్రం ఘోర పరాజయం అయ్యింది. తర్వాత చేస్తున్న సినిమా మీద చాలా జాగ్రతలు పడుతూ చేస్తున్నాడు. ఆ సినిమా పేరు ‘భాగ్యనగరవీధుల్లో గమ్మత్తు’. నటుడిగా, నిర్మాతగా, దర్శకుడిగా కూడా ఒక మెట్టు ఎక్కి ఇలా ప్రయత్నం చేస్తున్నాడు.
అలా సినిమా ఈ రోజు సౌండ్ మిక్సింగ్ కంప్లీట్ చేసుకుంది. మీ అందరి బ్లెస్సింగ్స్ నాకు కావలి, సినిమాని మీరు బాగా ఎంజాయ్ చేస్తారు. నో సెంటిమెంట్, నో యాక్షన్, ఓన్లీ కామెడీ అంటూ ట్వీట్ చేసారు శ్రీనివాస్ రెడ్డి గారు. మరి తను అనుకుంటున్నట్టు సినిమా మీద జనాలకి మరింత నమ్మకం రావాలి అని ప్రమోషన్స్ కూడా గట్టిగా చేయబోతున్నారు సినిమా యూనిట్ మొత్తం. ఇందులో బ్రహ్మానందం దగ్గర నుండి నేటితరం హాస్య కథానాయకులు అందరు ఉండటం సినిమాకి ప్లస్ పాయింట్స్.