Homeటాప్ స్టోరీస్అరుపు స్ట్రాటజీతో చిరాకు తెప్పిస్తున్న శ్రీముఖి

అరుపు స్ట్రాటజీతో చిరాకు తెప్పిస్తున్న శ్రీముఖి

అరుపు స్ట్రాటజీతో చిరాకు తెప్పిస్తున్న శ్రీముఖి
అరుపు స్ట్రాటజీతో చిరాకు తెప్పిస్తున్న శ్రీముఖి

బిగ్ బాస్ సీజన్ 3 లో శ్రీముఖి వన్ ఆఫ్ ది స్ట్రాంగ్ కంటెస్టెంట్ అనే అభిప్రాయం వ్యక్తమైంది చాలామందిలో. సీజన్ మొదలుపెట్టినప్పుడే ఈ అభిప్రాయం సోషల్ మీడియాలో పలు వేదికలపై వ్యక్తం చేసారు. తనకున్న ఫేమ్ కావొచ్చు, తనపై ఉన్న పాజిటివ్ ఫీల్ కావొచ్చు జనాలు అలా ఫీల్ అవ్వడంతో తప్పులేదు. శ్రీముఖి కచ్చితంగా ఫైనల్ చేరే కంటెస్టెంట్ అని అనుకున్నారు. అందుకు తగ్గట్లే బిగ్ బాస్ 3 లో ఫైనల్స్ కు చేరుకుంది శ్రీముఖి. రాహుల్, బాబా భాస్కర్ తర్వాత ఫైనల్స్ చేరిన మూడో కంటెస్టెంట్ శ్రీముఖి. లాస్ట్ వీక్ అప్పుడే మొదలై ఒకరోజు పూర్తయింది. మరో ఐదు రోజుల తర్వాత బిగ్ బాస్ విన్నర్ ఎవరనేది తెలిసిపోతుంది. నిన్న సుమ వచ్చి హౌజ్ లో ఫుల్ కామెడీ పంచింది. కంటెస్టెంట్స్ అందరి చేత ఫన్నీ గెస్సింగ్ గేమ్ ఆడించి ఆకట్టుకుంది. కంటెస్టెంట్స్ కూడా ఆమెకు సహకరిస్తూ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడంలో తమ వంతు సహాయం చేసారు.

ఇక శ్రీముఖి విషయానికి వస్తే ఎలాగైనా బిగ్ బాస్ గెలవాలన్న ఒకే ఒక్క లక్ష్యంతో ఆమె హౌజ్ లో అడుగుపెట్టింది. అందరూ హౌజ్ లోకి గెలవడానికే వస్తారు కానీ శ్రీముఖి ప్రేపరషన్ వేరు. బిగ్ బాస్ అన్ని భాషల్లో ఇప్పటిదాకా వచ్చిన సీజన్స్ అన్నీ ఒక చుట్టు చుట్టేసింది. ప్రతి ఎపిసోడ్ చదివేసి, ఏ టాస్క్ ఇచ్చినప్పుడు ఎలా రియాక్ట్ అవ్వాలి, ఏ పరిస్థితుల్లో ఎలా ఉంటే వర్కౌట్ అవుతుంది అన్న కోణంలో ఫుల్లుగా ప్రిపేర్ అయిపోయింది. ఇది ఆమెకు బానే ఉపయోగపడిందనే చెప్పాలి. అయితే బిగ్ బాస్ గెలవాలన్న ఆకాంక్షలో పడి ఆమె తన జర్నీని ఆస్వాదించడం మర్చిపోయిందా అన్న సందేహం కలుగుతుంది. ఎందుకంటే ఆమె ప్రతిసారీ ఎలాగైనా స్క్రీన్ టైం కొట్టేయాలని చూస్తుందే తప్ప అక్కడ ఏం చేయాలో అన్నది చూడదు.

- Advertisement -

స్క్రీన్ టైం కొట్టేయాలంటే ఎలా? ఆమెకు బాబా భాస్కర్ లా కామెడీ చేయడం రాదు, అలీ, శివజ్యోతిలా టాస్క్ లలో 100 పెర్సంట్ ఇవ్వడం రాదు. రాహుల్ లా పాటలు పాడలేదు, డ్యాన్స్ మాత్రం మ్యానేజ్ చేయగలదు. ఈ నేపథ్యంలో ఆమె ముందున్న ప్రధాన ఆయుధం అరవడం. ఎదుటివాడి గొంతు చిల్లు పడేలా అరుస్తూ అదే ఎంటటైన్మెంట్ అనుకుంటుంది శ్రీముఖి. ఎవరైనా కొంచెం స్క్రీన్ టైమ్ వచ్చిన ప్రతిసారి ఏదొక హడావిడి చేసి ఆమె కూడా ఉండేలా.చూసుకుంటుంది. విచిత్రమేమిటంటే బిగ్ బాస్ యాజమాన్యం అండ్ నాగార్జున కూడా దీన్ని ఎంకరేజ్ చేస్తుండడం. నాగార్జున ఇప్పటికే చాలా సార్లు నువ్వు అరిస్తేనే బాగుంటుంది అనడం, ఏది ఒక్కసారి అరిచి నీ ఆనందం చూపించు అంటూ దగ్గరుండి హడావిడి చేయడం జరిగింది. ఆమె అరవడంపై నిన్న షో కు వచ్చిన సుమ కూడా పంచ్ ఇచ్చి వెళ్ళింది. ‘అలా అరవకు.. ఇప్పటికే చాలా సార్లు చెప్పా గొంతు పోతుందని’ సుమ అనేసింది. దానికి బాబా భాస్కర్ తనదైన స్టైల్లో ఆమె గొంతు కాదు మా చెవులు పోతున్నాయి అనేశాడు. ఈ నేపథ్యంలో ఉన్న నాలుగైదు రోజులైనా శ్రీముఖి అరవడం మీద ఫోకస్ తగ్గిస్తే బాగుంటుందని అభిప్రాయపడుతున్నారు ఆమె అభిమానులు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All