Homeటాప్ స్టోరీస్శ్రీముఖి జీవితంలో చీకటి కోణం - ఎవరు ఆ అజ్ఞాతవాసి?

శ్రీముఖి జీవితంలో చీకటి కోణం – ఎవరు ఆ అజ్ఞాతవాసి?

శ్రీముఖి జీవితంలో చీకటి కోణం - ఎవరు ఆ అజ్ఞాతవాసి?
శ్రీముఖి జీవితంలో చీకటి కోణం – ఎవరు ఆ అజ్ఞాతవాసి?

ప్రతి వ్యక్తి జీవితంలోనూ నలుగురికీ తెలియని చీకటి కోణాలు, రహస్యాలు ఎన్నో ఉంటాయి. ఈ విషయంలో సెలబ్రిటీలు కూడా మినహాయింపేమి కాదు. సెలబ్రిటీలు కూడా తమ జీవితంలో కొన్ని విషయాలు ఎప్పటికీ రహస్యంగానే ఉంచాలని కోరుకుంటారు. బిగ్ బాస్ లాంటి షో లో పాల్గొనేవారు కూడా తమ రహస్యాలను బయటపెట్టాలనుకోరు. కానీ శ్రీముఖి మాత్రం బిగ్ బాస్ లో తన జీవితంలోని అతిపెద్ద సీక్రెట్ ను బయటపెట్టి సంచలనం సృష్టించింది.

ఎంత బిగ్ బాస్ షో అయినా, ఎంత బిగ్ బాస్ టాస్క్ ఇచ్చినా కూడా చెప్పకూడదనుకుంటే వేరేదేదో చెప్పి కవర్ చేయవచ్చు కానీ శ్రీముఖి తాను జీవితంలో ఎదుర్కొన్న వరస్ట్ ఫేజ్ గురించి ఓపెన్ అయిపోయింది. అందరిలానే తను కూడా కొన్నాళ్ల క్రితం ఒక వ్యక్తితో రిలేషన్ లో ఉన్నానని, అంతా సెట్.. ఇక పెళ్లి చేసుకోవడమే అన్న సమయంలో కథ మొత్తం మారిపోయిందని ఆమె చెప్పుకొచ్చింది. లేనిపోని మనస్పర్థల కారణంగా జీవితం మొత్తం ఒక్కసారిగా తలక్రిందులైనట్లు అయిపోయిందని ఆమె వ్యాఖ్యానించింది.

- Advertisement -

ఎవరి జీవితంలోనైనా బ్రేకప్ అనేది వరస్ట్ ఫేజ్. అప్పటిదాకా అవతలి వ్యక్తితో తమ జీవితాన్ని ఊహించుకున్న వారు, అది జరగట్లేదని తెలిసినప్పుడు డిప్రెషన్ లోకి వెళ్లడం సర్వసాధారణం. శ్రీముఖి కూడా అలానే డిప్రెషన్ లోకి వెళ్లిందట. మేకప్ రూమ్ సైడ్ కి వెళ్లి బోరుమని ఏడ్చిన రోజులు ఎన్నో ఉన్నాయని తన మనసులోని బాధను బయటపెట్టింది. అందమైన రిలేషన్ లో వచ్చిన అనుకోని డిస్టర్బెన్స్ వల్ల తాను చాలా సఫర్ అయినట్లు తెలిపింది. చివరికి చనిపోదామని కూడా అనుకున్నట్లు రివీల్ చేసి అందరికీ షాక్ ఇచ్చింది.

అన్నిటికన్నా షాకింగ్ విషయం.. అవతలి వ్యక్తి కూడా సెలబ్రిటీనేనట. అయితే ఇప్పుడు శ్రీముఖి జీవితంలో విలన్ ఎవరు? ఆమె ఏడ్చిన దానికి కారణం ఎవరు అన్నది పెద్ద ప్రశ్నగా మిగిలింది. సరిగ్గా గమనిస్తే శ్రీముఖి యాంకర్ గా తన తొలి రోజుల్లో ప్రదీప్ తో ఎక్కువగా షో లు చేసింది. ఒకరకంగా శ్రీముఖి లైమ్ లైట్లోకి రావడానికి ప్రదీప్ కూడా ఒక కారణం. అయితే ఉన్నట్లుండి ఎందుకో ప్రదీప్ తో కలిసి యాంకరింగ్ మానేసింది. అందువల్ల శ్రీముఖితో బ్రేకప్ జరిగిన ఆ వ్యక్తి ప్రదీపేనంటూ ప్రచారం మొదలైంది.

అయితే ప్రదీప్ తో కలిసి చేసిన యాంకరింగ్ మానేసినా కానీ తర్వాత బయట ఎక్కడైనా ప్రదీప్ గురించి పాజిటివ్ గానే మాట్లాడింది శ్రీముఖి. నిజంగా బ్రేకప్ అయితే అంత పాజిటివ్ గా మాట్లాడాల్సిన అవసరమేంటి అన్న వాదన కూడా ఉంది. దీని తర్వాత యాంకర్ రవితో చేసిన పటాస్ షో వల్ల శ్రీముఖి తెలుగునాట టాప్ యాంకర్ గా మారింది. ఇప్పుడు శ్రీముఖి పటాస్ నుండి కూడా బయటకు వచ్చేసింది. రీసెంట్ గా రవి బిగ్ బాస్ షోకి వచ్చినప్పుడు కూడా అంత క్లోజ్ గా ఏం మాట్లాడలేదు. ఇవన్నీ బేరీజు వేసుకుని ఆ వ్యక్తి రవి కూడా అయ్యుంటాడని అంటున్నారు.

మరి నిజంగా ఆ వ్యక్తి రవి యేనా? లేక ప్రదీపా? వీరిద్దరూ కాక మూడో వ్యక్తా అన్నది సస్పెన్స్ గానే ఉంది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All

గాసిప్స్

View All

Latest Posts