
సూపర్ స్టార్ మహేష్ బాబు మరోసారి తన బావను సపోర్ట్ చేయడానికి రంగంలోకి దిగుతున్నాడు. సుధీర్ బాబు హీరోగా నటించిన తాజా చిత్రం శ్రీదేవి సోడా సెంటర్. ఈ సినిమా ఆగస్ట్ 27న విడుదల కాబోతోంది. ఇప్పటికే ప్రమోషన్స్ ను షురూ చేసారు. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా ట్రైలర్ ను రేపు ఉదయం లాంచ్ చేయనున్నారు.
ఈ ట్రైలర్ ను సూపర్ స్టార్ మహేష్ బాబు విడుదల చేస్తుండడం విశేషం. ఈ అప్డేట్ ను చాలా వెరైటీగా ప్లాన్ చేసారు. రాజేష్ తో కలిసి సుధీర్ బాబు థియేటర్ కు వెళ్లి పోస్టర్ అతికించి మరీ ఈ అప్డేట్ ను ఇచ్చాడు. శ్రీదేవి సోడా సెంటర్ టైటిల్ దగ్గరనుండి ఆసక్తిని రేకెత్తించింది.
ఆనంది హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమాను పలాస ఫేమ్ కరుణ కుమార్ డైరెక్ట్ చేసాడు. మణిశర్మ సంగీతాన్ని అందించాడు.
Me and @Satyamrajesh2 had to paste a poster in theatre to save the publicity cost?? ???? Naaa … we had to do that because THIS IS A SUPERSPECIAL ANNOUNCEMENT ????
Watch this and wait for 19th Aug, 10 am ????https://t.co/wsWDqXo2fR#SrideviSodaCenter #SrideviSodaCenterOn27thAug— Sudheer Babu (@isudheerbabu) August 18, 2021