Homeన్యూస్చదలవాడ బ్రదర్స్ 9వ చిత్రం ప్రారంభం

చదలవాడ బ్రదర్స్ 9వ చిత్రం ప్రారంభం

Sri Tirumala Tirupathi Venkateswara films production 9 movie openningచదలవాడ బ్రదర్స్ సమర్పణలొ శ్రీ తిరుమల‌ తిరుపతి వెంకటేశ్వర ఫిలింస్ పతాకం పై చదలవాడ పద్మావతి నిర్మిస్తోన్న 9 చిత్రం‌ ఫిలింనగర్ సాయి బాబా టెంపుల్ లో ప్రారంభమైంది.

నాగుగవర ఈ చిత్రానికి దర్శకుడు. వసంత్ సమీర్, సెహర్ హీరొ హీరొయిన్లుగా , శ్రీహర్ష, రవివర్మ ముఖ్య పాత్రలొ నటిస్తున్నారు. ముహూర్తపు షాట్ కు జి.నాగేశ్వర రెడ్డి క్లాప్ నివ్వగా, దేవి ప్రసాద్ కెమెరా స్విచ్చాన్ చెశారు. సినీయర్ దర్శకులు అజయ్ కుమార్ గౌరవ దర్శకత్వం వహించారు.

- Advertisement -

నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు మాట్లాడుతూ..

మా‌బ్యానర్ లొ ఇది 9వ చిత్రం. జర్నలిస్ట్ వినాయక రావు గారి ద్వారా దర్శకుడు నాగు పరిచయమమయ్యాడు. తను విలువైన క్రైమ్ సబ్జెక్ట్ చెప్పాడు. ది బెస్ట్ కాంబొ లొ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాము. బిచ్చగాడు,డి16 తరహాలొనె విభిన్నమైన చిత్రమిది. ఈ టీమ్ అందరికి మంచి భవిష్యత్తు ఉండాలని ఆశిస్తున్నానన్నారు

దర్శకుడు నాగు గవర మాట్లాడుతూ.. వీకెండ్ లవ్ తరువాత సమయం తీసుకుని, వినాయకరావు గారి ద్వారా ఈ సినిమా చేస్తున్నాను . చదలవాడ శ్రీనివాసరావు గారు నిర్మాతగా పెద్ద బ్యానర్ లొ ఈ చిత్రాన్ని చేస్తున్నాను . కాటెంపరరీ క్రైమ్ కు సంబందించిన కథ ఇది. రియలిస్టిక్ గా గ్రిప్పింగ్ కథనంతో ఈ సినిమా ఉంటుంది. మంచి టీమ్ ఈ సినిమాకు సెట్ అయింది. ఈ నెల 14 నుంచి చిత్రీకరణ ప్రారంభిస్తామన్నారు.

అజయ్ కుమార్ మాట్లాడుతూ. మిత్రులు చదలవాడ శ్రీనివాసరావు గారు యంగ్ టాలెంట్ ను ఎంకరేజ్ చెస్తూ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కొత్తదనం తో వస్తొన్న ఈ టీమ్ కు మంచి పేరు రావాలని ఆశిస్తున్నానన్నారు.

ప్రసన్న కుమార్ మాట్లాడుతూ.. పెద్ద రేంజ్ సినిమాలు చెసె స్థాయి ఉన్నా, కొత్త కాన్సెప్ట్ లను , టాలెంట్ ను ఎంకరేజ్ చెయాలని చదలవాడ శ్రీనివాసరావుగారు‌ ఈ సినిమా చేస్తున్నారు . నాగు దర్శకుడిగా సక్సెస్ కొడతాడన్నారు.

హీరొ వసంత్ సమీర్ మాట్లాడుతూ..
అవకాశమిచ్చిన దర్శకనిర్మాతలకు దన్యవాదాలు. మా టీమ్ కు విజయం లభిస్తుందని అశిస్తున్నానన్నారు.

ఇంకా ఈ కార్యక్రమంలొ సెహర్ , రవి వర్మ, శ్రీహర్ష,
శ్రావణ్ భరద్వాజ్ తదితరలు పాల్గొన్నారు

 

వసంత్ సమీర్(తొలి పరిచయం), సెహర్(తొలి పరిచ) , రవి‌వర్మ, శ్రీ హర్ష, జబర్దస్త్ రాం ప్రసాద్ , రఘుబాబు, ,కాదంబరి కిరణ్, నీలిమ, జెమిని సురేష్, కమల్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: దుర్గా కిషోర్ బొయడపు, ఎడిటింగ్: ప్రవీణ్ పూడి, సంగీతం: శ్రావణ్ భరద్వాజ్, ఫైట్స్: డ్రాగన్ ప్రకాష్, కొరియోగ్రాఫర్: అనీ,
కాస్టూమ్స్: టి.ఎస్‌.రావు, కాస్టూమ్స్ డిజైనర్: మంజుల భూపతి, నిర్మాత: చదలవాడ పద్మావతి, రచన- దర్శకత్వం:నాగు గవర.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All