Homeగాసిప్స్బిగ్‌బాస్ 4లో `న‌గ్నం` బ్యూటీ?

బిగ్‌బాస్ 4లో `న‌గ్నం` బ్యూటీ?

బిగ్‌బాస్ 4లో `న‌గ్నం` బ్యూటీ?
బిగ్‌బాస్ 4లో `న‌గ్నం` బ్యూటీ?

బిగ్‌బాస్ సీజ‌న్ 4 త్వ‌ర‌లోనే ప్రారంభం కానున్న విష‌యం తెలిసిందే. గ‌త కొన్ని రోజులుగా ఈ సిరీస్ చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఇప్ప‌టికే ఇందులో పాల్గొనే కంటెస్టెంట్‌ల‌ని ఎంపిక చేస్తున్నారంటూ జోరుగా వార్త‌లు వినిపిస్తున్న నేప‌థ్యంలో తాజాగా మ‌రో హాటీ పేరు తెర‌పైకి వ‌చ్చింది. బిగ్‌బాస్ సీజ‌న్ 4లో వ‌ర్మ `న‌గ్నం` చిత్రంతో ప‌రిచ‌యం చేసిన స్వీటీ అలియాస్ శ్రీ రాపాక కంటెస్టెంట్‌గా పాల్గొన నుంద‌ని తాజాగా ఓ వా‌ర్త హ‌ల్ చ‌ల్ చేస్తోంది.

రామ్‌గోపాల్‌వ‌ర్మ రూపొందించిన  `న‌గ్నం` చిత్రంలో మ‌రింత బోల్డ్‌గా న‌టించి వార్త‌ల్లో నిలిచింది శ్రీ రాపాక‌. ఇటీవ‌ల ఈ చిత్ర ప్ర‌మోష‌న్‌లో భాగంగా ప‌లు మీడియా సంస్థ‌ల‌కు ఇంట‌ర్వ్యూలు ఇచ్చిన శ్రీ ప‌లువురిపై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసి ఇండ‌స్ట్రీ వ‌ర్గాల‌ని ఆశ్చ‌ర్య‌ప‌రుస్తున్న విష‌యం తెలిసిందే. `న‌గ్నం` సినిమా ప్ర‌మోష‌న్‌తో పాటు బిగ్‌బాస్ సీజ‌న్ 4లో అవ‌కాశం కోస‌మే శ్రీ రాపాక సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేస్తూ అటెన్ష‌న్ క్రియేట్ చేస్తోంద‌ని ఇండ‌స్ట్రీ వ‌ర్గాలు అంటున్నాయి.

- Advertisement -

బిగ్‌బాస్ సీజ‌న్ కోసం ఇప్ప‌టికే హీరో త‌రుణ్‌, మంగ్లీ, బిత్తిరి స‌త్తితో పాటు హాట్ హీరోయిన్స్ హంసా నందిని, శ్ర‌ద్దా దాస్‌, యామినీ భాస్క‌ర్‌, ప్రియా వ‌డ్ల‌మానిల‌ని ఎంపిక చేశారంటూ వార్త‌లు వినిపిస్తున్నాయి. ఈ సీజ‌న్‌ని మ‌రింత క్రేజీగా స్టార్ట్ చేయాల‌న్న ఆలోచ‌న‌లో భాగంగానే నిర్వాహ‌కులు హాట్ హీరోయిన్‌ల‌ని సెలెక్ట్ చేస్తున్నార‌ని జోరుగా ప్రచారం జ‌రుగుతోంది. ఇందులో భాగంగానే శ్రీ రాపాక ని బిగ్‌బాస్ సీజ‌న్ కోసం నిర్వాహ‌కులు ఎంపిక చేయాల‌నుకుంటున్నార‌ట‌. మ‌రి ఈ వార్త‌ల‌పై  శ్రీ రాపాక‌ ఎలా స్పందిస్తుందో చూడాలి.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All