
బాలీవుడ్ లో ప్రస్తుతం బయోపిక్ లో ట్రెండ్ నడుస్తోంది. అందులో కూడా స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో వచ్చే బయోపిక్స్ సినిమాలు అన్నీ .. సూపర్ హిట్ అవుతున్నాయి. ఉదాహరణకు భాగ్ మిల్కా భాగ్, మేరీ కోమ్, ఎం.ఎస్ ధోనీ ది అన్ టోల్డ్ స్టోరీ.. ఇలా ఇలా చెప్పుకుంటూ పోతే లిస్టు చాలా పెద్దదే ఉంది. రాబోయే రోజుల్లో కూడా కపిల్ దేవ్ బయోపిక్ 83, కూడా రాబోతోంది. బాక్సింగ్ క్రీడ నేపథ్యంలో ఇప్పటికే క్రీడాకారిణి మేరీకోమ్ జీవితంపై వచ్చిన బయోపిక్ సూపర్ హిట్ కాగా, మరొక క్రీడాకారుడు హెవీ వెయిట్ బాక్సింగ్ ఛాంపియన్ ఆఫ్ హర్యానా మిస్టర్ హవా సింగ్ నిజ జీవిత కథతో ఒక చిత్రం రూపొందుతోంది. ఈ సినిమాకు “హవా సింగ్” అనే పేరును ఖరారు చేశారు. ఆసియా క్రీడలలో వరుసగా రెండుసార్లు బంగారు పతకం సాధించారు హవా సింగ్. వరుసగా జాతీయ స్థాయిలో 1961 నుండి 1972 వరకు వరుసగా 11 సార్లు జాతీయ ఛాంపియన్ గా నిలిచారు. అర్జున అవార్డు, ద్రోణాచార్య అలాంటి ప్రతిష్టాత్మకమైన పురస్కారాలు కూడా అందుకున్నారు.
వెండితెరపై ఆయన పాత్రను సూరజ్ పంచోలి పోషించనున్నారు. ఈ సినిమాకు ప్రకాష్ నంబియార్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్ లుక్ ను బాలీవుడ్ భాయ్ సల్మాన్ ఖాన్ విడుదల చేశారు. ఈ సినిమా అతి త్వరలో సెట్స్ పైకి వెళ్లనుంది.