Homeఎక్స్ క్లూసివ్హీరోయిన్ మృతి కేసులో హీరోనే దోషి అట

హీరోయిన్ మృతి కేసులో హీరోనే దోషి అట

బాలీవుడ్ హీరోయిన్ జియా ఖాన్ మృతి కేసులో సీబీఐ ప్రత్యేక కోర్టు సంచలనానికి తెరలేపింది , హీరో సూరజ్ పంచోలి ని ముద్దాయిగా చేస్తూ ఆదేశాలు జారీ చేసింది దాంతో ఫిబ్రవరి లో సూరజ్ పంచోలి పై మళ్ళీ దర్యాప్తు మొదలు కానుంది . సీబీఐ ఆరోపిస్తున్న నేరాలు కనుక రుజువు అయితే ఈ హీరోకు గరిష్టంగా పదేళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉంది దాంతో జియా ఖాన్ తల్లి రుబియా ఖాన్ హర్షం వ్యక్తం చేసింది , నా కూతురు ని పొట్టన పెట్టుకున్న సూరజ్ ని ఉరి తీసినా పాపం లేదని విలపిస్తోంది జియా ఖాన్ తల్లి .

అమితాబ్ సరసన నిశ్శబ్ద్ చిత్రంలో నటించి సంచలనం సృష్టించింది జియా ఖాన్ . అతిచిన్న వయసులోనే బాలీవుడ్ లో ప్రభంజనం సృష్టించిన జియా ఖాన్ సూరజ్ పంచోలి ని ప్రేమించింది దాంతో ఇద్దరూ కల్సి సహజీవనం చేసారు . దాని ఫలితంగా జియా ఖాన్ నెల తప్పడంతో పిండాన్ని తీయించడానికి రకరకాల ప్రయత్నాలు చేసాడు సూరజ్ పంచోలి . ఆ ప్రయత్నాలు బెడిసి కొట్టడం వల్ల జియా ప్రాణాలకు ముప్పు ఏర్పడింది దాంతో ముంబై లోని జుహు లో గల తన అపార్ట్ మెంట్ లో ఆత్మహత్య కు పాల్పడింది అయితే తన ఆత్మహత్య కు గల కారణాలను విశ్లేషిస్తూ రాసిన ఉత్తరం ఇప్పుడు సూరజ్ మెడకు చుట్టుకుంది . సీబీఐ ఆరోపణలు రుజువు అయితే సూరజ్ కు ఏడేళ్ల నుండి పదేళ్ల వరకు శిక్ష పడే అవకాశం ఉంది .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All