
రియల్ హీరో సోనుసూద్ కు కరోనా పాజిటివ్ అని తేలింది. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే సోషల్ మీడియా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. కరోరా మహమ్మారి ప్రపంచాన్ని వణికించడం మొదలుపెట్టిన క్రమంలో దేశ వ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం లాక్‌డౌన్ విధించిన విషయం తెలిసిందే. ఈ సమయంలో వలస కూలీలు తమ గమ్య స్థానలకి చేరుకోవడానికి నానా ఇబ్బందులు పడాల్సి వచ్చింది.
ఈ సమయంలో వారిక కోసం నడం బిగించి ముందుకొచ్చిన వ్యక్తి సోనుసూద్. వలస కూలీల కోసం బస్సులు, ట్రైన్‌లు.. చివరికి ఫ్లైట్‌లని కూడా ఏర్పాటు చేసి వారిని తమ సొంతూళ్లకు క్షేమంగా చేర్చడంలో సోను ప్రధాన పాత్ర పోషించాడు. ఎంత ఖర్చు అవుతున్నా పట్టించుకోకుండా ఆసన్నుల పాలిట దైవంగా నిలిచి రియల్ హీరో అనిపించుకున్నారు.
తనకు కరోనా సోకిన సందర్భంగా ట్విట్టర్ ద్వారా శనివారం పలు ఆసక్తికర విషయాల్ని వెల్లడించారు. `ఈ రోజు ఉదయం నాకు కోవడ్ పాజిటివ్ అని నిర్ధారణ అయ్యింది. ముందస్తు చర్యల్లో భాగంగా ప్రస్తుతం నేను స్వీయ నిర్భంధంలోకి వెళ్లాను. తగిన జాగ్రత్తలు పాటిస్తున్నాను. కానీ మీరు మాత్రం బాధపడకండి. మీ సమస్యలు తీర్చేందుకు దీని వల్ల నాకు మరింత సమయం దొరికింది. గుర్తు పెట్టుకొండి నేను ఎప్పటికీ మీకు అండగా వుంటాను` అని ట్వీట్ చేశారు.
???? pic.twitter.com/2kHlByCCqh
— sonu sood (@SonuSood) April 17, 2021