Saturday, May 28, 2022
Homeటాప్ స్టోరీస్`సోలో బ్ర‌తుకే సో బెట‌ర్‌` మూవీ రివ్యూ

`సోలో బ్ర‌తుకే సో బెట‌ర్‌` మూవీ రివ్యూ

`సోలో బ్ర‌తుకే సో బెట‌ర్‌` మూవీ రివ్యూ
`సోలో బ్ర‌తుకే సో బెట‌ర్‌` మూవీ రివ్యూ

న‌టీన‌టులు:  సాయిధ‌ర‌మ్‌తేజ్‌, న‌భా న‌టేష్‌, రావు ర‌మేష్‌, రాజేంద్ర‌ప్ర‌సాద్‌, న‌రేష్, వెన్నెల కిషోర్‌, అజ‌య్‌, సుద‌ర్శ‌న్ త‌దిత‌రులు న‌టించారు.
ద‌ర్శ‌క‌త్వం:  సుబ్బు
నిర్మాత‌:  బీవీఎస్ ఎన్ ప్ర‌సాద్‌
సంగీతం: త‌మ‌న్‌
సినిమాటోగ్ర‌ఫీ: వెంక‌ట్ సి. దిలీప్‌
ఎడిటింగ్:  న‌వీన్ నూలి
రిలీజ్ డేట్: 25 – 12 – 2020
రేటింగ్: 3/5

- Advertisement -

ప్ర‌తీ రోజు పండ‌గే` వంటి హిట్ మూవీ త‌రువాత సాయి ధ‌ర‌మ్‌తేజ్ న‌టించిన చిత్రం `సోలో బ్ర‌తుకే సోబెట‌ర్‌`. సుబ్బు ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్న ఈ చిత్రం ఈ శుక్ర‌వారం థియేట‌ర్ల‌లో విడుద‌లైంది.
ప‌ది నెల‌ల త‌రువాత థియేట‌ర్లు రీ ఓపెన్ కావ‌డంతో ఈ మూవీ ఫ‌లితంపై ఇండ‌స్ట్రీ వ‌ర్గాల‌న్నీ ఆస‌క్తిగా ఎదురుచూశాయి. ఆ రోజు రానే వ‌చ్చింది. వేయి క‌ళ్ల‌తో ఇండ‌స్ట్రీ అంతా ఎదురు చూసిన ఫ‌లితాన్ని `సోలో బ్ర‌తుకే సోబెట‌ర్` సాధించిందా? .. ఈ మూవీ ఫ‌లితం కోసం ఎదురుచూస్తున్న ఫిల్మ్ మేక‌ర్స్‌కి ఈ మూవీ ఎలాంటి ధైర్యాన్ని క‌లిగించింది? ప‌ది నెల‌ల విరామం త‌రువాత కోటి ఆశ‌ల‌తో థియేట‌ర్‌కి పరుగులు పెట్టిన స‌గ‌టు ప్రేక్ష‌కుడిని మెప్పించ గ‌లిగిందా.. లేదా? అనేది తెలియాలంటే క‌థ‌లోకి వెళ్లాల్సిందే.

క‌థ‌:
విరాట్ (సాయి ధ‌ర‌మ్‌తేజ్‌) త‌న లైఫ్‌లో పెళ్లికి చోటు లేద‌ని సోలో బ్ర‌తుకే సో బెట‌ర్ అని జాలీగా జీవిస్తూ త‌న లాగే త‌న ఫ్రెండ్స్.. స్టూడెంట్స్ వుండాల‌ని ఓ బుక్ ప‌ట్టుకుని మ‌రీ ప్ర‌చారం చేస్తుంటాడు. ఇందు కోసం ఓ గ్రూప్‌ని కూడా ర‌న్ చేస్తుంటాడు. అలాంటి అత‌నికి హైద‌రాబాద్‌లో ఈవెంట్ మేనేజ్‌మెంట్ కంప‌నీలో ఉద్యోగం వ‌స్తుంది. అందు కోసం హైద‌రాబాద్ వెళ్లిన విరాట్ కు అమృత ( న‌భా న‌టేష్‌) ప‌రిచ‌యం అవుతుంది. త‌న పెళ్లిని క్యాన్సిల్ చేసుకుని విరాట్ కు ఓకే చెబుతుంది. ఇంత‌కీ అమృత ఎవ‌రు?  విరాట్‌నే ఎందుకు ప్రేమించింది? అమృత ప్రేమ కోసం విరాట్ ఏం చేశాడు?  విరాట్ చివ‌రికి అమృత ఒక్క‌ట‌య్యారా? అన్న‌ది తెర‌పై చూడాల్సిందే.

న‌టీన‌టుల న‌ట‌న :
సింగిల్ ఫ‌రెవ‌ర్ అంటూ విరాట్ పాత్ర‌లో సాయిధ‌ర‌మ్‌తేజ్ ఆక‌ట్టుకున్నాడు. రియ‌ల్ లైఫ్‌లో పెళ్లిని వాయిదా వేస్తూ వెళుతున్న సాయిధ‌ర‌మ్‌తేజ్ విరాట్ పాత్ర‌ని ఓన్ చేసుకుని న‌టించిన తీరు మెప్పిస్తుంది.
రావు ర‌మేష్ తో వ‌చ్చే స‌న్నివేశాల‌తో పాటు న‌భా న‌టేష్ కాంబినేష‌న్‌లో వ‌చ్చే స‌న్నివేశాల్లో సాయిధ‌ర‌మ్‌తేజ్ ఆక‌ట్టుకున్నారు. త‌న‌దైన న‌ట‌న‌తో ఫ‌స్ట్ హాఫ్‌ని హుషారెత్తించారు. న‌భా న‌టేష్ త‌న అందంతో.. న‌ట‌న‌తో ఆక‌ట్టుకునే ప్ర‌య‌త్నం చేసింది.

క‌థ‌కు కీల‌కంగా నిలిచిన ప్ర‌ధాన పాత్ర‌లో రావు ర‌మేష్ ఆక‌ట్టుకున్నారు. త‌న‌దైన డైలాగ్‌ల‌తో మెప్పించే ప్ర‌య‌త్నం చేశారు. భావోద్వేగ స‌న్నివేశాల్లోనూ ఆయ‌న న‌టన మెప్పిస్తుంది. ఇక వెన్నెల కిషోర్, స‌త్య‌, సుద‌ర్శ‌న్ త‌మ‌దైన మార్కు హాస్యంతో న‌వ్వించారు. డా. రాజేంద్ర‌ప్ర‌సాద్, న‌రేష్‌, అజ‌య్‌ల పాత్ర‌ల‌కు పెద్ద‌గా స్కోప్ లేదు. అయినా పాత్ర‌ల ప‌రిధిమేర‌కు న‌టించారు. ‌

సాంకేతిక నిపుణుల ప‌నితీరు:
భారీ చిత్రాల నిర్మాతగా పేరున్న బీవీఎస్ ఎన్ ప్ర‌సాద్ ఈ చిత్రాన్ని భారీగా నిర్మించారు. నిర్మాణ విలువ‌లు ఆక‌ట్టుకుంటాయి. ప్ర‌తీ ఫ్రేమ్ రిచ్‌గా వుండేలా చూసుకున్నారు. వ‌రుస బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌ల‌ని త‌న ఖాతాలో వేసుకుంటూ టాలీవుడ్‌లో టాప్ మ్యూజిక్ డైరెక్ట‌ర్‌గా ట్రెండింగ్ అవుతున్న త‌మ‌న్ ఈ చిత్రానికి ప్ర‌ధాన బ‌లంగా నిలిచాడు. త‌మ‌న్ అందించిన పాట‌లు, నేప‌థ్య సంగీతం బాగుంది. వెంక‌ట్ సి. దిలీప్ అందించిన విజువ‌ల్స్ రిచ్‌గా వున్నాయి. ద‌ర్శ‌కుడు సుబ్బు డైలాగ్స్ సినిమాకు మ‌రింత ప్ల‌స్ అయ్యాయి.

విశ్లేష‌ణ‌:
సోలో బ్ర‌తుకే సో బెట‌ర్ అనే థీమ్‌తో ఈ చిత్రాన్ని తెర‌కెక్కించారు. పాయింట్ ప‌రంగా మంచి అంశాన్నే ఎంచుకున్న ద‌ర్శ‌కుడు సుబ్బు అందుకు త‌గ్గ సీన్‌ల‌ని మ‌రింత బాగా రాసుకుని వుంటే ఫ‌లితం మ‌రింత బాగుండేది. ఫ‌స్ట్ హాఫ్‌ని ఎంట‌ర్‌టైనింగ్ తెర‌కెక్కించి సెకండ్ హాఫ్‌పై ఆ స్థాయిలో కేర్ తీసుకోన‌ట్టుగా క‌నిపిస్తోంది. బ‌ల‌మైన స‌న్నివేశాల‌తో పాటు ఎంట‌ర్‌టైన్‌మెంట్ లోపించ‌డం కొంత మైన‌స్ గా మారింది. ఇవ‌న్నీ ప‌క్క‌న పెడితే ప‌ది నెల‌ల విరామం త‌రువాత థియేట‌ర్ల‌కి వ‌చ్చిన స‌గ‌టు ప్రేక్ష‌కుడిని ఎంట‌ర్‌టైన్ చేయ‌డంలో మాత్రం ద‌ర్శ‌కుడు సుబ్బు స‌క్సెస్ అయ్యాడ‌నే చెప్పాలి. యావ‌త్ ఇండ‌స్ట్రీ ఆస‌క్తిగా ఎదురుచూసిన ఈ మూవీ ప్రేక్ష‌కుల నుంచి ఆశించిన స్పంద‌న‌నే రాబ‌ట్టింది అన‌డంలో ఎలాంటి సందేహం లేదు.

Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All

గాసిప్స్

View All

Latest Posts