
ఈ సంక్రాంతి బరికి ఇప్పటికే రెండు చిత్రాలు రెడీ అయిపోయాయి. మాస్ మహారాజా రవితేజ నటిస్తున్న `క్రాక్` జనవరి 15న సంక్రాంతికి రిలీజ్ కాబోతున్న విషయం తెలిసిందే. ఇదే బాటలో ఎనర్జిటిక్ హీరో రామ్ నటించిన `రెడ్` కూడా రిలీజ్ కాబోతోంది. ఇదిలా వుంటే అల్లరి నరేష్ చిత్రం కూడా జనవరిలో విడుదలకు సిద్ధమవుతోంది. అల్లరి నరేష్ నటిస్తున్న తాజా చిత్రం `బంటగారు బుల్లోడు`.
గిరి పాలిక దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. పూజా ఝవేరి కథానాయిక. హిలేరియల్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సుంకర రామబ్రహ్మం నిర్మిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తయిన ఈ చిత్రాన్ని జనవరికి విడుదల చేయాలని చిత్ర బృందం ప్లాన్ చేస్తోంది. దీనికి సంబంధించిన ఓ పోస్టర్‌ని చిత్ర బృందం మంగళవారం విడుదల చేసింది.
త్వరలో ఆడియోని రిలీజ్ చేయబోతున్నారు. సాయి కార్తీక్ సంగీతం అందించిన ఈ చిత్ర గీతాల్ని రామజోగయ్య శాస్త్రి రాశారు. అల్లరి నరేష్ మార్కు కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ చిత్రంలో తనికెళ్ల భరణి, పోసాని కృష్ణమురళి, పృథ్వీ, ప్రవీణ్, వెన్నెల కిషోర్, సత్యం రాజేష్, ప్రభాస్ శ్రీను, జబర్దస్త్ మహేష్, అనంత్, భద్రమ్, అజయ్ ఘోష్ తదితరులు నటిస్తున్నారు.