Homeటాప్ స్టోరీస్శోభ‌న్‌బాబు బ‌యోపిక్..అవ‌న్నీ వుంటేనే ఇంట్రెస్టింగ్‌!

శోభ‌న్‌బాబు బ‌యోపిక్..అవ‌న్నీ వుంటేనే ఇంట్రెస్టింగ్‌!

శోభ‌న్‌బాబు బ‌యోపిక్..అవ‌న్నీ వుంటేనే ఇంట్రెస్టింగ్‌!
శోభ‌న్‌బాబు బ‌యోపిక్..అవ‌న్నీ వుంటేనే ఇంట్రెస్టింగ్‌!

ఈ మ‌ధ్య కాలంలో బ‌యోపిక్ అంటే న‌చ్చింది మాత్ర‌మే తెర‌పైన చూపించ‌డం.. పాజిటివ్ అంశాల‌కు మాత్ర‌మే ప్రాధాన్య‌త‌నివ్వ‌డం అన్న‌ట్టుగా మారింది. దీంతో బ‌యోపిక్ అనే ప‌దానికే అర్థం మారిపోయింది. ఇదే పంథాలో ఎన్టీఆర్ బ‌యోపిక్‌ని తెర‌పైకి తీసుకొచ్చారు. పాజిటీవ్ ఓన్లీ అనే కోణంలో ఈ సినిమాని రెండు భాగాలుగా రూపొందించారు. ఆస‌క్తిక‌ర‌మైన అంశాల‌ని గాలికి వ‌దిలేశారు. చ‌రిత్ర‌ని మార్చారు. దీంతో రెండు భాగాలుగా వ‌చ్చిన ఎన్టీఆర్ బ‌యోపిక్ ఏ ఒక్క‌రినీ ఆక‌ట్టుకోకుండా బ‌యోపిక్‌ల హిస్ట‌రీలో అత్యంత దారుణంగా ఫ్లాప్ అయిన చిత్రంగా నిలిచింది.

తాజాగా లెజెండ‌రీ న‌టుడు శోభ‌న్‌బాబు జీవిత క‌థ ఆధారంగా బ‌యోపిక్ రానుందంటూ ప్ర‌చారం మొద‌లైంది. ఇందులో హీరోగా శోభ‌న్‌బాబు పాత్ర‌లో రానా న‌టిస్తారని టాక్ వినిపిస్తోంది. దీనిపై ఇంత వ‌ర‌కు అధికారిక ప్ర‌క‌ట‌న లేదు. ఊహాగానాలైతే గ‌త రెండు మూడు రోజులుగా వినిపిస్తున్నాయి. అయితే శోభ‌న్‌బాబు బ‌యోపిక్ చేస్తే ఆస‌క్తిక‌ర‌మైన అంశాలు ఆయ‌న జీవితంలో ఎన్నో వున్నాయ‌ని వాట‌న్నింటిని తెర‌పై ఆవిష్క‌రిస్తేనే ఇంట్రెస్టింగ్ గా వుంటుంద‌ని అలా కాకుండా ఎన్టీఆర్ బ‌యోపిక్ త‌ర‌హాలో చేస్తే ఇది కూడా ప్రేక్ష‌కుల్ని ఆక‌ట్టుకోలేద‌నే చ‌ర్చ మొద‌లైంది.

- Advertisement -

న‌టుడిగా బిజీగా వున్న ద‌శ‌లోనే శోభ‌న్‌బాబు ఎందుకు సినిమాల నుంచి త‌ప్పుకున్నారు? .. అలా త‌ప్పుకోవ‌డం వెన‌క ఏం జ‌రిగింది? ఆయ‌న‌ని అవ‌మానించింది ఎవ‌రు? ఆయ‌నని ఓ ప్ర‌ముఖ తార ప్రేమించింద‌ని, ఆరాధించింద‌ని చాలా వార్త‌లు వినిపించాయి. ఇలాంటి విష‌యాల‌తో పాటు ఆయ‌న హీరోగా ఎదిగిన క్ర‌మం, శోభ‌నా చ‌ల‌ప‌తిరావు శోభ‌న్‌బాబుగా ఎలా మారారు వంటి ఇష‌యాల్ని చ‌ర్చిస్తే బాగుంటుంద‌ని ఇండ‌స్ట్రీ వ‌ర్గాల‌తో పాటు ఆయ‌న అభిమానుల్లో చ‌ర్చ జ‌రుగుతోంది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All