Homeటాప్ స్టోరీస్చిన్నారి స్నేహని ప‌రిచ‌యం చేసింది!

చిన్నారి స్నేహని ప‌రిచ‌యం చేసింది!

Sneha introduces is doughter adhyantaa
Sneha introduces is doughter adhyantaa

ప్రేమ‌క‌థా చిత్రాల‌కు, కుటుంబ క‌థా చిత్రాల‌కు కేరాఫ్ అడ్ర‌స్ గా నిలిచింది హీరోయిన్ స్నేహ‌. హీరోయిన్‌గా కెరీర్ లో బిజీగా వున్న స‌మ‌యంలోనే హీరో ప్ర‌స‌న్న‌ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఆ త‌రువాత కూడా సినిమాల్లో కంటిన్యూ అవుతూ వ‌స్తున్న స్నేహ `స‌న్నాఫ్ స‌త్య‌మూర్తి` త‌రువాత సెలెక్టీవ్‌గా సినిమాల్లో న‌టించ‌డం మొద‌లుపెట్టింది. అందం, అభిన‌యంలో మేటి అనిపించుకుని హోమ్లీ హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్న స్నేహ రెండ‌వ బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చింది.

ముందు స్నేహ‌, ప్ర‌స‌న్న దంప‌తుల‌కు బాబు పుట్టాడు. తాజాగా జ‌న‌వ‌రిలో స్నేహ పండంటి పాపాయికి జ‌న్మ‌నిచ్చింది. శ్రీ‌మంతం అప్ప‌ట్లో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. అయితే పాప పుట్టి ఏడు నెల‌లు కావ‌స్తున్నా ఇంత వ‌ర‌కు మీడియాకు చూపించ‌లేదు. ప‌రిచ‌యం చేయ‌లేదు. తాజాగా భ‌ర్త ప్ర‌స‌న్న పుట్టిన రోజు ని పుర‌స్క‌రించుకుని స్నేహ త‌న పాప‌ని ప‌రిచ‌యం చేసింది.

- Advertisement -

ముద్దుల‌ పాప‌కి సంబంధించిన ఫొటోల‌ని ఇన్ స్టా వేదిక‌గా భ‌ర్త‌తో క‌లిసి షేర్ చేసింది. పాప‌, భ‌ర్త‌తో క‌లిసి ఆనంద‌క్ష‌ణాల్ని ఆస్వాదిస్తున్న ఓ ఫొటోని స్నేహ అభిమానుల‌తో పంచుకుంది. `జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు మై సోల్ మేట్‌. మై ల‌వ‌ర్ బాయ్‌..గార్డియ‌న్ ఏంజిల్ సూప‌ర్ డాడా..ఈ ల‌డ్డుల‌తో నా లైఫ్‌ని అందంగా మ‌లిచినందుకు థ్యాంక్స్‌. స‌దా మ‌నం ఉన్న‌త స్థానంలో వుండాల‌ని దీవించి ఆకాంక్షించే వారికి  ఈ రోజు నా చిట్టిత‌ల్లి ఆద్యంత‌ను ప‌రిచ‌యం చేస్తున్నందుకు చాలా ఆనందంగా వుంది`అని స్నేహ పోస్ట్ చేసింది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All