Homeగాసిప్స్విశ్వ‌క్‌సేన్‌కు భారీ ఆఫ‌ర్ ఇస్తున్నారా? ‌

విశ్వ‌క్‌సేన్‌కు భారీ ఆఫ‌ర్ ఇస్తున్నారా? ‌

విశ్వ‌క్‌సేన్‌కు భారీ ఆఫ‌ర్ ఇస్తున్నారా? ‌
విశ్వ‌క్‌సేన్‌కు భారీ ఆఫ‌ర్ ఇస్తున్నారా? ‌

మ‌ల‌యాళంలో సూప‌ర్‌హిట్‌ గా నిలిచిన చిత్రం `క‌ప్పెల‌`. విభిన్న‌మైన ప్రేమ‌క‌థ నేప‌థ్యంలో రూపొందిన ఈ చిత్రంపై విమర్శ‌కులు ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు. ఇదే చిత్రాన్ని తెలుగులో సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ సంస్థ రీమేక్ చేయ‌బోతోంది. ఇప్ప‌టికే రీమేక్ హ‌క్కుల్ని ఫ్యాన్సీ రేటుకి సొంతం చేసుకుంది కూడా.

మ‌ల‌యాళంలో విజ‌య‌వంత‌మైన చిత్రాల‌కు తెలుగులో మంచి డిమాండ్ ఏర్ప‌డుతున్న నేప‌థ్యంలో `క‌ప్పెల‌` రీమేక్ రైట్స్‌ని సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ సొంతం చేసుకోవ‌డంతో ఈ సినిమాపై తెలుగులో భారీ అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. అంతే కాకుండా ఇటీవ‌ల యుంగ్ డైరెక్ట‌ర్ త‌రుణ్ భాస్క‌ర్ ఈ సినిమాని పొగ‌డ్త‌ల్లో ముంచేస్తూ క‌మ‌ర్ష‌య‌ల్ చిత్రాల‌ని ఏకిపారేయ‌డం కూడా ఈ సినిమా స‌ర్వ‌త్రా ఆస‌క్తిని రేకెత్తిస్తోంది.

- Advertisement -

ఇదిలా వుంటే ఈ చిత్ర రీమేక్ కోసం సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ అధినేత సూర్య‌దేవ‌ర నాగవంశీ యంగ్ హీరో విశ్వ‌క్‌సేన్‌ని సంప్ర‌దించిన‌ట్టు తెలిసింది. ఈ చిత్రం కోసం విశ్వ‌క్‌సేన్‌కు కోటిన్న‌ర ఆఫ‌ర్ కూడా చేశార‌ట‌. విశ్వ‌క్‌సేన్ మాత్రం ఇంకా ఎలాంటి నిర్ణ‌యాన్ని వెల్ల‌డించ‌లేద‌ని తెలిసింది. `హిట్‌` సినిమాతో విశ్వ‌క్‌సేన్ రీసెంట్‌గా హిట్‌ని సొంతం చేసుకున్నాడు. ప్ర‌స్తుతం `పాగ‌ల్‌` చిత్రంలో న‌టిస్తున్నాడు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All