Homeటాప్ స్టోరీస్షాక్: ఐసీయూలో సిరివెన్నెల

షాక్: ఐసీయూలో సిరివెన్నెల

షాక్: ఐసీయూలో సిరివెన్నెల
షాక్: ఐసీయూలో సిరివెన్నెల

తన తొలి సినిమానే ఇంటిపేరుగా మార్చుకున్న లెజండరీ పాటల రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి ఆసుపత్రిలో జాయిన్ అయ్యారు. ఆయన రెండు రోజుల నుండి ఊపిరి తీసుకోవడంలో సమస్యలు రావడంతో హాస్పిటల్ కు వెళ్లగా న్యుమోనియా అని తేలింది. ఆయన్ను సికింద్రాబాద్ లోని కిమ్స్ హాస్పిటల్ లో జాయిన్ చేసారు. వైద్యులు పరీక్షలు చేసి న్యుమోనియా అని కనుగొని ప్రస్తుతం వైద్యం అందిస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఐసీయూలో ఉన్నట్లు తెల్సింది.

ప్రస్తుతం ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు సిరివెన్నెల కుటుంబ సభ్యులు మీడియాకు తెలిపారు. “కంగారు పడాల్సిన అవసరం లేదు. ఊపిరితిత్తుల్లో న్యుమోనియా ప్యాచ్ పై ప్రస్తుతం చికిత్స అందిస్తున్నారు” అని మీడియాకు కుటుంబ సభ్యులు సమాచారమందించారు. ఎన్నో వందల సినిమాల్లో సిరివెన్నెల తన రచనలతో అందరినీ ఉత్సాహపరిచారు.

- Advertisement -

కవిగా ఆయన సామర్ధ్యం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆయన స్థాయి పాటల రచయితగా ఉన్నతంగా ఉంది. తెలుగు సినీ సాహిత్యానికి ఆయన చేసిన సేవలకు గాను భారత ప్రభుత్వం పద్మశ్రీ బిరుదుతో సత్కరించింది. ఆయన వయసు 66 సంవత్సరాలు.

ఇవి కూడా చదవండి:

మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచలర్ చిట్టి అడుగు సాంగ్: ఫిలాసఫీతో ఆడేసుకున్న సిరివెన్నెల

“సిరివెన్నెల ” ఆడియో లాంచ్‌

మ‌హాన‌టి ఫేమ్ బాల‌న‌టి సాయి తేజ‌స్విని ప్ర‌ధాన ప్రాత‌లో ప్రియ‌మ‌ణి “సిరివెన్నెల”‌

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All