HomeVideosమోస్ట్ ఎలిజిబుల్ బ్యాచలర్ చిట్టి అడుగు సాంగ్: ఫిలాసఫీతో ఆడేసుకున్న సిరివెన్నెల

మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచలర్ చిట్టి అడుగు సాంగ్: ఫిలాసఫీతో ఆడేసుకున్న సిరివెన్నెల

మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచలర్ చిట్టి అడుగు సాంగ్: ఫిలాసఫీతో ఆడేసుకున్న సిరివెన్నెల
మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచలర్ చిట్టి అడుగు సాంగ్: ఫిలాసఫీతో ఆడేసుకున్న సిరివెన్నెల

అఖిల్ అక్కినేని, పూజ హెగ్డే హీరో హీరోయిన్లుగా రూపొందిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచలర్ ఈ దసరా పండగకు ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెల్సిందే. అక్టోబర్ 15న విడుదల కానున్న ఈ చిత్రానికి ప్రమోషన్స్ జోరందుకున్నాయి. ఇప్పటికే ఈ చిత్రంలోని రెండు, మూడు పాటలు సూపర్ హిట్ అయ్యాయి. ప్రీ రిలీజ్ ఈవెంట్ ను కూడా ఘనంగా నిర్వహించారు.

ఇక ఇప్పుడు ఈ చిత్రం నుండి చిట్టి అడుగు సాంగ్ ను విడుదల చేసారు. ఈ పాట వింటుంటే సినిమాలో ఒక కీలకమైన సందర్భంలో వచ్చే పాటగా అనిపిస్తోంది. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచలర్ లో హీరో తన గురించి తాను తెలుసుకోవడం, జీవితం గురించి కొత్త అర్ధాన్ని అన్వేషించడం వంటి నేపథ్యంలో ఈ పాట వస్తుంది.

- Advertisement -

ఈ పాటలో మెయిన్ హైలైట్ సిరివెన్నెల సాహిత్యం అనే చెప్పాలి. “ఎవ్వరూ ఏం చెప్పలేదా ఒక్కసారి.. ఇన్నాళ్లూ గాలిలోనే తేలి ఆడే చిట్టి అడుగా, సరేలే ఇప్పుడైనా తెలిసిందిగా తొలిసారి ఇకనైనా నెలతాకి నేర్చుకోవె కొత్త నడక” ఈ లైన్లో సినిమా సారాంశాన్ని భలేగా ఇనుమడింపచేసాడు సిరివెన్నెల సీతారామశాస్త్రి. గోపి సుందర్ మరోసారి తన ప్రతిభను చూపించాడు. ఇక జియా ఉల్ హక్ తన గాత్రంతో పాటకు నిండుతనాన్ని తెచ్చారు. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచలర్ లో కథాగమనాన్ని తిప్పే ఈ పాట ఇన్స్టంట్ గా కనెక్ట్ అవ్వడం అనేది సినిమాకు ప్లస్ అవుతుంది. బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రాన్ని బన్నీ వాస్, వాసు వర్మ నిర్మించారు.

YouTube video

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All