Homeటాప్ స్టోరీస్ప్రీ వెడ్డింగ్ పార్టీల‌తో కొత్త జంట‌ హ‌ల్‌చ‌ల్‌!

ప్రీ వెడ్డింగ్ పార్టీల‌తో కొత్త జంట‌ హ‌ల్‌చ‌ల్‌!

ప్రీ వెడ్డింగ్ పార్టీల‌తో కొత్త జంట‌ హ‌ల్‌చ‌ల్‌!
ప్రీ వెడ్డింగ్ పార్టీల‌తో కొత్త జంట‌ హ‌ల్‌చ‌ల్‌!

`ఈ వేళ‌లో నీవు ఏం చేస్తుం వుంటావో..` పాట‌లో పాపుల‌ర్ అయిన సింగ‌ర్ సునీత‌. గ‌త కొంత కాలంగా ఈమె రెండో పెళ్లి గురించి టాలీవుడ్‌లో హాట్ చ‌ర్చ న‌డుస్తోంది. ఇటీవ‌లే రామ్ అనే ఓ మీడియా వ్య‌క్తిని పెళ్లి చేసుకోబోతున్న‌ట్టు సునీత సోష‌ల్ మీడియా వేదిక‌గా ప్ర‌క‌టించింది. రెండు వారాల క్రితం వీరికి పెద్ద‌ల స‌మ‌క్షంలో ఎంగేజ్‌మెంట్ కూడా జ‌రిగింది.

వీరి పెళ్లికి స్టార్ ప్రొడ్యూస‌ర్ ఒక‌రు మ‌ధ్య వ‌ర్తిగా కూడా వ్య‌వ‌హ‌రించార‌ని, ఈ వయ‌సులో పెళ్లి చేసుకోవ‌డం వ‌ల్ల పిల్ల‌ల‌కు సెక్యూరిటీ వుంటుంద‌ని స‌ద‌రు స్టార్ ప్రొడ్యూస‌ర్ చెప్ప‌డంతో సునీత .. రామ్ సూర‌ప‌నేనిని వివాహం చేసుకోవ‌డానికి అంగీక‌రించిన‌ట్టు ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో వినిపిస్తోంది. ఈ నెల లోనే వీరి వివాహం జ‌ర‌గ‌నుంద‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. ఇదిలా వుంటే ప్రీ వెడ్డింగ్ టైమ్‌ని కొత్త జంట సెల‌బ్రేట్ చేసుకుంటోంది.

- Advertisement -

ఇటీవ‌ల గ‌చ్చిబౌలిలోరి ఓ స్టార్ హోట‌ల్‌లో ఈ జంట‌కు ఇటీవ‌ల వివాహం చేసుకున్న ఓ యంగ్ హీరో పార్టీని అరేంజ్ చేశారు. ఈ పార్టీలో రేణుదేశాయ్‌, సుమ‌తో పాటు చాలా మంది సెల‌బ్రిటీలు పాల్గొన్నారు. ఈ పార్టీలో కొత్త‌గా ఒక్క‌టి కాబోతున్న సునీత‌, రామ్‌లు హ‌ల్‌చ‌ల్ చేశార‌ని, వీరి పార్టీకి సంబంధించిన ఫొటోలు సోష‌ల్ మీడియాలో ప్ర‌స్తుతం వైర‌ల్‌గా మారాయి.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All