
కరోనా మహమ్మారి ఎవ్వరినీ విడిచి పెట్టడం లేదు. ఇటీవల టాలీవుడ్ సెలబ్రిటీలకు సైతం కరోనా వైరస్ పాకిన విషయం తెలిసిందే. ముందు టాలీవుడ్ ప్రొడ్యూసర్ కమ్ యాక్టర్ బండ్ల గణేష్ కరోనా సోకింది. ఆ తరువాత ఆయన వెంటనే కోలుకోవడం తెలిసిందే. తాజాగా టాలీవుడ్ సెలబ్రిటీలు రాజమౌళి, ఆయన కుటుంబం, ఆ తరువాత నిర్మాత డి.వి.వి. దానయ్య, దర్శకుడు తేజ వైరస్ బారిన పడ్డారు. ఇప్పటికే రాజమౌళి ఆయన కుటుంబం కోలుకోగా తేజ హోమ్ క్వారెంటైన్‌లో వుంటూ చికిత్స పొందుతున్నారు.
ఇదిలా వుంటే క్రేజీ సింగర్స్ కూడా కరోనా బారిన పడ్డారు. సింగర్ సునీత, సింగర్ మాళవిక తాజగా కరోనా బారిన పడ్డారు. ఇటీవల ఓ టీవి షో కోసం ఏర్పాటు చేసిన సంగీత కార్యక్రమంలో సంగీత, మాళవిక పాల్గొన్నారట. అక్కడే వారికి కరోనా సోకినట్టు నిర్ధారణ అయ్యింది. అంతే కాకుండా ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారంతా కరోరా బారిన పడినట్టు వార్తలు వినిపిస్తున్నాయి.
ప్రస్తుతం వీరికి కరోనా పాజిటివ్ అని నిర్ధారణ కావడంతో డాక్టర్లను సంప్రదించి హోమ్ క్వారెంటైన్‌లో చికిత్స పొందుతున్నారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాల్ని సింగర్ సునీత సోషల్ మీడియా వేదికగా వెల్లడిస్తుందేమో చూడాలి. ఇటీవల సునీత క్రేజ్‌ని అడ్డంపెట్టుకుని ఓ యువకుడు భారీ ఎత్తున మోసాలకు పాల్పడిన విషయం తెలిసిందే.