Homeటాప్ స్టోరీస్సూపర్ స్టార్ సినిమా సీక్వెల్ లో నటించడం లేదన్న సీనియర్ హీరోయిన్

సూపర్ స్టార్ సినిమా సీక్వెల్ లో నటించడం లేదన్న సీనియర్ హీరోయిన్

సూపర్ స్టార్ సినిమా సీక్వెల్ లో నటించడం లేదన్న సీనియర్ హీరోయిన్
సూపర్ స్టార్ సినిమా సీక్వెల్ లో నటించడం లేదన్న సీనియర్ హీరోయిన్

హీరోయిన్ గా ఉన్నప్పుడు వరస సినిమాలతో సౌత్ ఇండస్ట్రీలో దాదాపు అందరు టాప్ హీరోలతో ఆడిపాడిన హీరోయిన్ సిమ్రాన్. తన సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా సిమ్రాన్ బిజీగానే ఉంది. తమిళ్ లో సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టిన సిమ్రాన్ డిటెక్టివ్, సీమరాజా, పేట సినిమాల్లో నటించింది. పేట సినిమాలో రజినీకాంత్ సరసన నటించిన సిమ్రాన్, ప్రస్తుతం సూపర్ స్టార్ సినిమా సీక్వెల్లో నటిస్తోందంటూ గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది. దానిపై సిమ్రాన్ స్పందించింది. అసలు విషయంలోకి వెళితే..

2005లో రజినీకాంత్ తొలిసారి హారర్ థ్రిల్లర్ జోనర్ లో నటించిన చిత్రం చంద్రముఖి. ఈ సినిమా తెలుగులో కూడా ఎంత పెద్ద హిట్టో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ సినిమాకు సీక్వెల్ ఉంటుందని అప్పట్లోనే దర్శకుడు పి. వాసు స్పందించాడు. అయితే తమిళంలో కంటే ముందే తెలుగులో నాగవల్లి పేరుతొ వెంకటేష్ హీరోగా ఈ సినిమాకు సీక్వెల్ తెరకెక్కింది.

- Advertisement -

మళ్ళీ ఇన్నాళ్ల తర్వాత తమిళంలో లారెన్స్ హీరోగా చంద్రముఖి సీక్వెల్ తెరకెక్కుతోందని వెల్లడైన విషయం తెల్సిందే. సన్ పిక్చర్స్ వారు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ త్వరలోనే మొదలుకానుంది. సిమ్రాన్ ఈ చిత్రంలో కీలక పాత్రలో నటిస్తోందంటూ జరుగుతున్న ప్రచారం ఈ సీనియర్ హీరోయిన్ బ్రేకులు వేసింది. నన్ను ఈ సినిమా కోసం ఎవరూ సంప్రదించలేదు. నా ఫ్యాన్స్ లో ఈ విషయంలో నిరుత్సాహపరుస్తున్నాను. వార్త రాసేముందు క్లారిటీ తీసుకోండి అని సిమ్రాన్ స్పందించింది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All