Homeటాప్ స్టోరీస్శ్రియా భూపాల్ పెళ్లి

శ్రియా భూపాల్ పెళ్లి

shriya bhupal marriage with anindith reddyఅఖిల్ మాజీ లవర్ శ్రియా భూపాల్ పెళ్లి జరిగింది . ఇటీవలే శ్రియా భూపాల్ వివాహ నిశ్చితార్థం ఉపాసన కజిన్ తో అయిన విషయం తెలిసిందే . కాగా తాజాగా శ్రియ భూపాల్ పెళ్లి అనిన్దిత్ రెడ్డి తో జరిగింది , ఈవేడుకకు పలువురు సినీ , రాజకీయ ప్రముఖులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు . శ్రియా భూపాల్ రెడ్డి అనిన్ దిత్ రెడ్డి ల జంట చూడముచ్చటగా ఉండటంతో ఆహుతుల అభినందనలతో పెళ్లి వేడుక కళకళ లాడింది . మహేష్ బాబు భార్య నమ్రత శిరోద్కర్ పిల్లలతో సహా హాజరయ్యింది శ్రియా భూపాల్ పెళ్లి కి .

ఇక చరణ్ – ఉపాసన లు కూడా ఈ పెళ్లి వేడుకలకు హాజరయ్యారు . ఉపాసన కు అనిన్ దిత్ కజిన్ కావడంతో పెళ్లి వేడుకలో ఉపాసన హడావుడి ఎక్కువ అయ్యింది అలాగే చరణ్ హడావుడి కూడా . అఖిల్ – శ్రియా భూపాల్ లు ప్రేమించుకున్నారు కాగా వాళ్ళ ప్రేమ కు పెద్దలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు దాంతో వివాహ నిశ్చితార్థం జరిగింది . అయితే ఆ తర్వాత ఇద్దరి మధ్య విబేధాలు రావడంతో వివాహ నిశ్చితార్థం రద్దు చేసుకున్నారు . అఖిల్ తన దృష్టి సినిమాలపై మళ్ళించంగా శ్రియా భూపాల్ హాయిగా అనిన్ దిత్ రెడ్డి ని పెళ్లి చేసుకుంది .

- Advertisement -

English Title: shriya bhupal marriage with anindith reddy

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All