Homeటాప్ స్టోరీస్బోయపాటి కి 12 కోట్ల రెమ్యునరేషనా ?

బోయపాటి కి 12 కోట్ల రెమ్యునరేషనా ?

Shocking remuneration for boyapati for balakrishna's filmనందమూరి బాలకృష్ణ తో తన తదుపరి చిత్రం చేయనున్నట్లు ఎన్టీఆర్ బయోపిక్ వేడుకలో బోయపాటి శ్రీను ప్రకటించిన విషయం తెలిసిందే . అయితే ఈ సినిమా కోసం షాకింగ్ రెమ్యునరేషన్ అందుకుంటున్నాడు దర్శకులు బోయపాటి శ్రీను . ఈ సినిమాకు 12 కోట్ల రెమ్యునరేషన్ అని తెలుస్తోంది . ఇంత భారీ మొత్తం ఎందుకయ్యా అంటే …….. బాలయ్య ని ఎలా చూపించాలో బోయపాటి శ్రీను కు బాగా తెలియడమే !

ఇంతకుముందు బాలయ్య – బోయపాటి శ్రీను ల కాంబినేషన్ లో సింహా , లెజెండ్ చిత్రాలు రాగా ఆ రెండు కూడా బ్లాక్ బస్టర్ లు అయ్యాయి . ఆ రెండు సినిమాలు కూడా బాలయ్య లోని సరికొత్త నటుడిని చూపించాయి అలాగే హీరోయిజం లో పీక్స్ ని చూపించాయి . దాంతో బాలయ్య మాత్రమే కాదు బాలయ్య అభిమానులు కూడా ఆ సినిమాలను చూసి పూనకంతో ఊగిపోయారు . ఆ రెండు సినిమాల తర్వాత ముచ్చటగా మూడో సినిమాకు తెరలేపారు . బాలయ్య కు బోయపాటి పైన బాగా గురి అందుకే తనని అభిమానులు కోరుకునే విధంగా చూపిస్తాడు కాబట్టి రెమ్యునరేషన్ విషయంలో కాంప్రమైజ్ కాకుండా 12 కోట్లు ముట్టజెపుతున్నాడట . ఇంకో విశేషం ఏంటంటే ఈ సినిమాని బాలయ్య నిర్మిస్తుండటం .

- Advertisement -

English Title: Shocking remuneration for boyapati for balakrishna’s film

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All