Homeఎక్స్ క్లూసివ్బాలకృష్ణ పై తీవ్ర విమర్శలు చేసిన పోసాని

బాలకృష్ణ పై తీవ్ర విమర్శలు చేసిన పోసాని

Posani krishnamurali fires on balakrishnaనందమూరి బాలకృష్ణ పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేసాడు ప్రముఖ నటుడు , రచయిత పోసాని కృష్ణమురళి . తెలంగాణలో కేసీఆర్ కు ప్రజలు బ్రహ్మరథం పట్టడంతో ఈరోజు ఉదయం మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసాడు పోసాని . ఆ సందర్బంగా కేసీఆర్ పై ప్రశంసల వర్షం కురిపించిన పోసాని బాలయ్య పై మాత్రం నిప్పులు చెరిగాడు . నిజమే బాలయ్య చాలా పవర్ ఫుల్ ఎందుకంటే వాళ్ళ నాన్నకు వెన్నుపోటు పొడిస్తే ……. చంద్రబాబు తాట తీసాడు అందుకే పవర్ ఫుల్ అంటూ సెటైర్ వేసాడు .

అంతేనా …….. కూకట్ పల్లి లో నందమూరి సుహాసిని ని దగ్గరుండి మరీ గెలిపించాడు . ఎన్టీఆర్ పై చెప్పులు విసిరేస్తే మా నాన్నపై చెప్పులు వేసింది ఎవడ్రా అని చెప్పులు వేసిన వాడి తాట తీసాడని అందుకే బాలయ్య చాలా పవర్ ఫుల్ అంటూ వెటకారంగా చెప్పాడు పోసాని . బాలకృష్ణ పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేయడంతో బాలయ్య తో పాటుగా బాలయ్య అభిమానులు కూడా ఆగ్రహం వ్యక్తం చేయడం ఖాయం . బాలయ్య అభిమానులు పోసాని పై ఫైర్ అవ్వడం ఖాయం అయితే బాలయ్య వైఖరి ఏంటో మరి .

English Title: Posani krishnamurali fires on balakrishna

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All