HomeVideosసాయిబాబా క్షేత్రం షిరిడీ కాదా.?

సాయిబాబా క్షేత్రం షిరిడీ కాదా.?

YouTube video

మళ్ళీ వివాదాలు అలుముకుంటున్నాయి. ఈ సారి సాయిబాబాపై కాకుండా ఆయన జన్మభూమి, కర్మభూమి ఏదీ.? అనే అంశం పై వివాదం రాజుకుంది. మహారాష్ట్రలోని షిరిడీకి 275 కిలోమీటర్ల దూరంలో పర్బాని  జిల్లాలో పత్రి అనే ఊరు ఉంది. ఇక్కడే సాయిబాబా జన్మించారనే ప్రచారం ఎప్పటి నుంచో ఉంది.

- Advertisement -

సాయిబాబా జన్మించిన స్థలం పత్రి అని నిరూపించడానికి తగిన ఆధారాలున్నాయని మహారాష్ట్ర సర్కార్‌లోని నేతలు చెబుతున్నారు. షిరిడీ… సాయిబాబా కర్మభూమి అయితే… పత్రి జన్మభూమి అని స్పస్టం చేస్తున్నారు. సాయి బాబా జన్మ స్థలంపై ఎన్నో ప్రశ్నలు ఉన్నాయి. బాబా జన్మస్థలం ఎక్కడ అనేది ఎవరికి పూర్తిగా తెలియదు.

1854లో అంటే 16 ఏళ్ల వయస్సులో సాయి షిరిడీకి వచ్చారని తొలుత ఓ వేపచెట్టుకింద సాయి బాబా కనిపించారని, షిరిడీకి 275 కిలోమీటర్ల దూరంలో పర్బాని జిల్లాలో పాథ్రీ అనే ఊరిలో సాయిబాబా జన్మించారని మహారాష్ట్ర సర్కార్‌ చెబుతోందిప్పుడు. అయితే ఆయన అసలు పేరు కూడా ఎవరికి తెలియదట. దీనితో ఖండోబా పూజారి ఒకరు సాయి అని నామకరణం చేసినట్టు చరిత్రలో ఉంది.

షిర్డీ సాయిబాబా 1835, సెప్టెంబర్‌ 28న బ్రిటిష్‌ ఇండియాలో ని నిజాం రాష్ట్రంలోని పత్రిలో బ్రాహ్మణ దంపతులకు జన్మించారనీ, ఐదేళ్ల బాలుడిగా ఉండగా సాయిబాబాని ఓ ఫకీర్‌కి పిల్ల లు లేని కారణంగా పెంచుకోవడానికి ఇచ్చేసినట్టు సత్యసాయి బాబా (పుట్టపర్తి) చెప్పినట్టు చరిత్రకారులు దాస్‌గణు మహారాజ్, గోవింద్‌ దబోల్కర్‌లు తమ పుస్తకంలో ప్రస్తావించారు.ఈ బాలుడిని పెంచడం కష్టంగా భావించిన ఫకీరు భార్య సాయిబాబాని తమ పొరుగింట్లో ఉండే వెంకుశ అనే వ్యక్తికి అప్పగించారు. 1839 నుంచి 1851 వరకు వెంకుశ ఆశ్రమంలోనే గడిపడిన సాయిబాబా 16 ఏళ్ల వయస్సులో షిర్డీకి వచ్చినట్టు చెబుతారు.

పత్రీ గ్రామం సాయిబాబా జన్మస్థలం అంటూ స్థానికులు వాదిస్తున్నారు. 1999లో అక్కడ శ్రీ సాయి జన్మస్థాన్ మందిరాన్ని నిర్మించారు. భక్తులు పెద్ద మొత్తంలో ఆలయానికి వస్తుండడంతో ఇటీవల ఉద్దవ్ సర్కార్ పత్రిలోని సాయిబాబా ఆలయ అభివృద్ధికి రూ.100 కోట్లు ప్రకటించింది. ఇక్కడే అసలు గొడవ మొదలైంది. పత్రిని సాయిబాబా జన్మస్థలంగా అభివృద్ధి చేస్తామన్న సీఎం ప్రకటనపై షిరిడీలోని సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్ ఆగ్రహం వ్యక్తం చేసింది.

వాస్తవానికి పత్రి ఆలయం గురించి బయటి ప్రపంచానికి పెద్దగా తెలియదు.. షిరిడీలో కొలువైన సాయిబాబాను దేశవ్యాప్తంగా కోట్లాది మంది భక్తులు కొలుస్తుంటారు. అయితే, షిరిడీతో సమానంగా పత్రి ఆలయాన్ని అభివృద్ధి చేస్తామని ప్రభుత్వం చెబుతోంది. ఈ నిర్ణయాన్ని షిరిడీ సాయిబాబా సంస్థాన్ తప్పుబడుతోంది. పత్రిని అభివృద్ధి చేస్తే షిరిడీ ప్రాముఖ్యం తగ్గిపోతుందని ఆందోళన వెలిబుచ్చింది.

సాయిబాబా జన్మస్థానంపై వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో శిర్డీ గ్రామస్థులు ఇచ్చిన బంద్‌ చేస్తున్నారు. అయితే ఆలయ దర్శనాలు మాత్రం యథావిధిగా కొనసాగుతున్నాయి. ఆదివారం ఉదయం భక్తులు భారీ ఎత్తున బాబా దర్శనానికి తరలివచ్చారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ‘సాయిబాబా సంస్థాన్‌ ట్రస్ట్‌’ అన్ని ఏర్పాట్లు చేసింది. శిరిడీ సహా చుట్టుపక్క గ్రామాల ప్రజలు స్వచ్ఛందంగా బంద్‌ పాటిస్తున్నారు. దుకాణాలు, పాఠశాలలు మూతపడ్డాయి. కార్యకలాపాలన్నీ స్తంభించడంతో వీధులన్నీ నిర్మానుష్యంగా మారాయి.

ఇంతకీ సాయిబాబాది షిరిడీనా… పథ్రీనా? – సాయి భక్తులకు షాక్‌ ఇచ్చింది ఎవరు?-

ఈ వివాదం ఇప్పుడే కొత్తగా ఎందుకు పుట్టుకొచ్చింది –

ఈ వివాదం రాజకీయమా… ఆధ్యాత్మికమా?

ఒకసారి ఆలోచిస్తే… సమాజంలో ఎప్పుడూ సంచలన కథనాల కోసం ఆరాటపడుతూ, వాటిపై వివాదాలు రాజేస్తూ, తమ పబ్బం గడుపుకునే ఒక గుంపు చేసే ప్రయత్నం గా ఈ చర్య తెలుస్తోంది.

Shocking Facts About Shirdi Temple
సాయిబాబా క్షేత్రం షిరిడీ కాదా.?
- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All