Homeటాప్ స్టోరీస్కన్నీళ్లు పెట్టుకున్న శివాజీరాజా

కన్నీళ్లు పెట్టుకున్న శివాజీరాజా

Shivaji Raja unhappy with Nareshమా ఎన్నికలు మరోసారి రణరంగాన్ని తలపిస్తున్నాయి . రెండేళ్ల క్రితం ఎలాంటి గొడవలు లేకుండా ఎన్నికలు కాగా ఈసారి మాత్రం నాలుగేళ్ళ క్రితం జరిగిన గొడవలను తలపిస్తున్నాయి మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికలు . శివాజీరాజా ప్యానల్ – నరేష్ ప్యానల్ పోటీ పడుతున్నాయి ఈసారి . అయితే జరుగుతున్న పరిణామాలు , అలాగే నరేష్ వ్యవహరిస్తున్న తీరుతో శివాజీరాజా కన్నీళ్ల పర్యంతం అయ్యాడు . నిన్న రాత్రి శివాజీరాజా ప్యానల్ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఉబికి వస్తున్న కన్నీళ్ళని ఆపుకోలేకపోయాడు .

 

- Advertisement -

ఇటీవలే నా పుట్టినరోజు జరుగగా ఆ రోజు నేను వస్తున్నాను అంటూ నాకు మెసేజ్ పెట్టాడు నరేష్ దాంతో మా ప్రధాన కార్యదర్శి కాబట్టి అతడి కోసం నా కార్యక్రమాలను పక్కన పెట్టి మరీ మా ఆఫీసులో రెండు గంటలకు పైగా వెయిట్ చేశాను కానీ నరేష్ రాలేదు సరికదా ! నేను రివేంజ్ తీర్చుకుంటే ఎలా ఉంటుందో తెలియజేయడానికి వెయిట్ చేయించాను అని స్టాఫ్ తో అన్నాడట ! అలాంటి శాడిస్ట్ మా ప్రెసిడెంట్ కావడానికి వీల్లేదు అందుకే ఈసారి పోటీ చేస్తున్నాను అంటూ సంచలన వ్యాఖ్యలు చేసాడు శివాజీరాజా . మొత్తానికి మా ఎన్నికలు రాజకీయ నాయకులను తలపిస్తున్నాయి .

English Title : Shivaji Raja unhappy with Naresh

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All