Homeగాసిప్స్సెన్సిబుల్ డైరెక్ట‌ర్ స్టైల్ మార్చారు!

సెన్సిబుల్ డైరెక్ట‌ర్ స్టైల్ మార్చారు!

సెన్సిబుల్ డైరెక్ట‌ర్ స్టైల్ మార్చారు!
సెన్సిబుల్ డైరెక్ట‌ర్ స్టైల్ మార్చారు!

ఒక సినిమా అండ‌ర్ ప్రొడ‌క్ష‌న్‌లో వుండ‌గా మ‌రో సినిమా ఒకే చేయ‌డం అన్న‌ది కొంత మందికి ఇష్టం వుందు. అలాంటి ద‌ర్శ‌కుల్లో సెన్సిబుల్ డైరెక్ట‌ర్ శేఖ‌ర్ క‌మ్ముల ఒక‌రు. అయితే అయ‌న ప్ర‌స్తుతం స్టైల్ మార్చారు. ఒక సినిమా అండ‌ర్ ప్రొడ‌క్ష‌న్‌లో వుండ‌గానే మ‌రో చిత్రానికి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేశారు. శేఖ‌ర్ క‌మ్ముల ప్ర‌స్తుతం తెర‌కెక్కిస్తున్న చిత్రం `ల‌వ్‌స్టోరీ`.

నాగ‌చైత‌న్య‌, సాయి ప‌ల్ల‌వి జంట‌గా న‌టిస్తున్నారు. నారాయ‌ణ్‌దాస్ నారంగ్, పి. రామ్మోహ‌న్‌రావు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తెలంగాణ‌లోని ఓ రూర‌ల్ ఏరియా నుంచి సిటీకి వ‌చ్చిన ఇద్ద‌రు ప్రేమికుల క‌థ‌గా ఈ చిత్రాన్నిచ‌క్క‌ని భావోద్వేగాల స‌మాహారంగా తెర‌కెక్కిస్తున్నారు. మ‌రో 15 రోజులు చిత్రీక‌ర‌ణ మిన‌హా షూటింగ్ మొత్తం పూర్త‌యింది.

- Advertisement -

ఇదిలా వుండ‌గా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న నారాయ‌ణ్‌దాస్ నారంగ్‌కి శేఖ‌ర్ క‌మ్ముల మ‌రో చిత్రాన్ని క‌మిట్ అయిన‌ట్టు తెలిసింది. శేఖ‌ర్ క‌మ్ముల క‌మిట్‌మెంట్ న‌చ్చ‌డంతో సినిమా అండ‌ర్ ప్రొడ‌క్ష‌న్‌లో వుండ‌గానే మ‌రో ప్రాజెక్ట్‌ని ఓకే చేయించార‌ట‌. అయితే ఈ చిత్రం ఎవ‌రితో వుండే అవ‌కాశం వుంది?.. హీరోయిన్ ఎవ‌రు? వ‌ంటి డిటైల్స్‌ని చిత్ర బృందం వెల్ల‌డించ‌నున్న‌ట్టు తెలిసింది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All