Homeటాప్ స్టోరీస్శ‌ర్వా ఆడాళ్ల‌కు జోహార్లు చెప్పేస్తున్నాడు!

శ‌ర్వా ఆడాళ్ల‌కు జోహార్లు చెప్పేస్తున్నాడు!

శ‌ర్వా ఆడాళ్ల‌కు జోహార్లు చెప్పేస్తున్నాడు!
శ‌ర్వా ఆడాళ్ల‌కు జోహార్లు చెప్పేస్తున్నాడు!

వ‌రుస మూడు ఫ్లాపుల త‌రువాత యంగ్ హీరో శ‌ర్వానంద్ సినిమాల విష‌యంలో స్పీడు పెంచారు. ప్ర‌స్తుతం ఓ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌.. ఓ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌ల‌తో బిజీగా వున్నాడు. ఈ రెండు చిత్రాల‌తో పాటు తాజాగా మ‌రో చిత్రాన్ని కూడా శ‌ర్వా లైన్‌లో పెట్టిన‌ట్టు తెలిసింది. లాక్‌డౌన్ బిఫోర్ శ‌ర్వానంద్ హీరోగా `శ్రీ‌కారం ` చిత్రం ప్రారంభ‌మైంది.

తిరుప‌తిలో కీల‌క షెడ్యూల్ స్టార్ట్ చేయాల‌నుకున్నారు. ఈలోగా క‌రోనా వైర‌స్ ప్ర‌బ‌ల‌డంతో గ‌త ఏడు నెల‌లుగా ఈ మూవీ షూటింగ్ ఆగిపోయింది. ఇటీవ‌లే తిరుప‌తిలో మ‌ళ్లీ షూటింగ్ మొద‌లుపెట్టారు. 14 రీల్స్ ప్ల‌స్ బ్యాన‌ర్‌పై ఈ చిత్రాన్ని రామ్ ఆచంట‌, గోపీచంద్ ఆచంట నిర్మిస్తున్నారు. ఇటీవ‌లే `Rx100`డైరెక్ట‌ర్‌తో `మ‌హా స‌ముద్రం` చిత్రాన్ని అంగీక‌రించారు. త్వ‌ర‌లోనే ఈ మూవీ రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభం కాబోతోంది.

- Advertisement -

తాజాగా కిషోర్ తిరుమ‌ల ద‌ర్శ‌క‌త్వంలో రొమాంటిక్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైనర్‌కి శ‌ర్వా గ్రీన్‌సిగ్న‌ల్ ఇచ్చిన‌ట్టు తెలిసింది. ఈ చిత్రానికి `ఆడాళ్లు మీకు జోహార్లు` అనే టైటిల్‌ని ఫిక్స్ చేశారు. `ప‌డి ప‌డి లేచే మ‌న‌సు`, `విరాట‌ప‌ర్వం` చిత్రాల నిర్మాత సుధాక‌ర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మించ‌బోతున్నారు. విజ‌య‌ద‌శ‌మి సంద‌ర్భంగా ఈ నెల 25న ఈ చిత్రాన్ని లాంఛ‌నంగా ప్రారంభిస్తున్నారు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All