Homeటాప్ స్టోరీస్ట్రోల‌ర్స్‌కి సుహాన స్ట్రాంగ్ కౌంట‌ర్‌!

ట్రోల‌ర్స్‌కి సుహాన స్ట్రాంగ్ కౌంట‌ర్‌!

ట్రోల‌ర్స్‌కి సుహాన స్ట్రాంగ్ కౌంట‌ర్‌!
ట్రోల‌ర్స్‌కి సుహాన స్ట్రాంగ్ కౌంట‌ర్‌!

కింగ్ ఖాన్, బాలీవుడ్ బాద్ షారుక్‌ఖాన్ ముద్దుల కూతురు సుహానా ఖాన్ సోష‌ల్ మీడియా ద్వారా నిత్యం వార్త‌ల్లో నిలుస్తోంది. సోష‌ల్ మీడియా ఇన్ స్టాలో త‌న ఫ్రెండ్స్‌తో క‌లిసి షికారు చేసిన ఫొటోల్ని షేర్ చేస్తూ ఆక‌ట్టుకున్న సుహాన బాలీవుడ్‌ డ్ర‌గ్స్ వివాదంపై కూడా ఇటీవ‌ల సెటైర్లు వేసిన విష‌యం తెలిసిందే. కేవ‌లం అమ్మాయిల్ని మాత్ర‌మే టార్గెట్ చేస్తున్నారంటూ త‌న‌దైన స్టైల్లో కౌంట‌ర్లేసింది. తాజాగా త‌ను న‌ల్ల‌గా వుంద‌ని సెటైర్లు వేసిన వారికి గ‌ట్టి షాకిచ్చింది.

సుహానే నువ్వేమంత అందంగా వుండ‌వ‌రి, చాలా బ్లాక్‌గా వుంటావ‌ని, క‌ల‌ర్‌గా క‌నిపించ‌డానికి స‌ర్జ‌రీ కూడా చేయించుకున్నావ‌ని కొంత మంది సుహానేని టార్గెట్ చేస్తూ ట్రోల్ చేయ‌డం మొద‌లుపెట్టారు. ట్రోల్ చేయ‌డ‌మే కాకుండా చిత్ర విచిత్ర‌మైన మీమ్స్‌తో సుహానా ఖాన్‌ని దారుణంగా ఇబ్బంది పెట్టారు. దీంతో ఆగ్ర‌హించిన సుహానా తెలివిగా వారికి స్ట్రాంగ్ కౌంట‌ర్ ఇచ్చింది.

- Advertisement -

స‌మాజంలో వున్న స‌మ‌స్య‌ల్లో ట్రోలింగ్ ఒక‌టి. ఈ స‌మ‌స్య‌ని తానొక్క‌దాన్నే ఎదుర్కోవ‌డం లేద‌ని, త‌న‌లాంటి చాలా మంది యువీత యువ‌కులు ఎదుర్కొంటున్నార‌ని, దీన్ని రూపుమాపాల్సిన టైమ్ వ‌చ్చింద‌న్నారు. నెటిజ‌న్స్ నేను అందంగా వుండ‌నని, అట్లీగా వుంటాన‌ని కామెంట్‌లు చేస్తున్నారు. ఇది ఇప్ప‌టి నుంచి కాదు నేను 12 ఏళ్ల వ‌య‌సులో వున్న‌ప్ప‌టి నుంచి ఇదే త‌ర‌హా విమ‌ర్శ‌లు ఎదుర్కొంటున్నాను. వాటికి నేను ఏమాత్రం బాధ‌ప‌డ‌టం లేదు. మ‌న‌మంతా భార‌తీయులం. గోధుమ రంగు మేనిఛాయ‌తో వుంటాం. కానీ కొంత మంది ఈ విష‌యం తెలియ‌ని ముర్ఖులు త‌మ వారినే విమ‌ర్శిస్తుంటారు` అంటూ ఘాటుగా స్పందించింది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All