
అగ్ర దర్శకుడు శంకర్ ఇప్పుడు విచిత్రమైన పరిస్థితుల్లో ఉన్నాడు. ఆయన దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఇండియన్ 2 అర్ధాంతరంగా ఆగిపోయింది. ఆ తర్వాత లీగల్ సమస్యల్లో ఇరుక్కుంది. మరోవైపు శంకర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో సినిమాకు కమిటయ్యాడు. కానీ ఇండియన్ 2 పూర్తవ్వకుండా మరో సినిమా చేయడానికి లేదంటూ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ కోర్టు మెట్లెక్కింది.
ఇదిలా ఉంటే శంకర్ దృష్టి మాత్రం రామ్ చరణ్ సినిమాపైనే ఉంది. ఇప్పటికే ఫైనల్ డ్రాఫ్ట్ ను సిద్ధం చేసేసాడు శంకర్. కాస్టింగ్ ప్రాసెస్ ను కూడా త్వరలో మొదలుపెట్టాలనుకుంటున్నాడు. ప్రస్తుతం దిల్ రాజు యూఎస్ లో ఉన్నాడు. నెల రోజుల తర్వాత తిరిగి వస్తాడు. అప్పుడు మీటింగ్ బట్టి రెగ్యులర్ షూటింగ్ ఎప్పుడు మొదలవుతుంది అన్న విషయంపై నిర్ణయం తీసుకుంటారు.
ఈలోగా శంకర్ ఇండియన్ 2 కాంట్రవర్సీకి ఫుల్ స్టాప్ పెడతాడేమో చూడాలి. ఈ చిత్రంలో కమల్ హాసన్ హీరోగా నటిస్తోన్న విషయం తెల్సిందే.