
దక్షిణ భారతీయ సినీ దిగ్గజ దర్శకుల్లో శంకర్ ఒకరు. ఆయన ఒక్కో చిత్రానికి పారితోషికం భారీ స్థాయిలోనే తీసుకుంటున్నారు. తాజాగా రామ్‌చరణ్ తో ఆయన భారీ ప్రాజెక్ట్‌ని చేస్తున్న విషయం తెలిసిందే. ఈ ప్రాజెక్ట్ ప్రకటించన దగ్గరి నుంచి రోజుకో వార్త నెట్టింట హల్‌చల్ చేస్తోంది. తాజాగా శంకర్ రెమ్యునరేషన్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
రామ్‌చరణ్ 15వ చిత్రమిది. యాదృచ్చికంగా ఈ ప్రాజెక్ట్ కూడా శంకర్‌కు 15వదే కావడం విశేషం. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై ఈ పాన్ ఇండియా చిత్రాన్ని దిల్‌రాజు, శిరీష్ నిర్మించబోతున్నారు. ఈ బ్యానర్‌కిది 50వ చిత్రం. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్‌లో వున్న ఈ మూవీకి శంకర్ తీసుకుంటున్న రెమ్యునరేషన్ ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది.
శంకర్ ప్రతి చిత్రానికి 40 కోట్లు తీసుకుంటున్నారు. `ఇండియన్ 2`కు కూడా ఇదే మొత్తాన్నితీసుకున్నారు. ఇప్పుడు రామ్‌చరణ్ చిత్రానికి కూడా ఇదే మొత్తాన్ని డిమాండ్ చేశారట. అందుకు దిల్‌రాజు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు చెబుతున్నారు. మన దేశంలో ఈ స్థాయిలో పారితోషికాన్ని అందుకుంటున్న దర్శకులలో శంకర్‌ది రెండవ స్థానం. రాజమౌళి ప్రధమ స్థానంలో వున్నారు. ఆయన ప్రతి చిత్రానికి బిజినెస్‌లో వాటాతో కలిపి 75 కోట్లు తీసుకుంటున్నారట.