Homeటాప్ స్టోరీస్రామ్‌చ‌ర‌ణ్ బ‌ర్త్‌డే రోజున ఫ్యాన్స్‌కి స్పెష‌ల్ గిఫ్ట్!

రామ్‌చ‌ర‌ణ్ బ‌ర్త్‌డే రోజున ఫ్యాన్స్‌కి స్పెష‌ల్ గిఫ్ట్!

Ram charans brand new poster on his Birthday
Ram charans brand new poster on his Birthday

మెగా ప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్ పుట్టిన రోజున గ‌త ఏడాది `భీమ్ ఫ‌ర్ రామరాజు` పేరుతో `ఆర్ ఆర్ ఆర్‌` టీమ్ ఓ టెర్రిఫిక్ విజువ‌ల్స్‌తో రామ్‌చ‌ర‌ణ్ పాత్ర‌కు సంబంధించిన వీడియోని రిలీజ్ చేసిన విష‌యం తెలిసిందే. ఈ వీడియోకు ప‌లు భాష‌ల్లో యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ వాయిస్ ఓవ‌ర్ అందించారు. ఈ వీడియోకి ఎన్టీఆర్ అందించిన వాయిస్ ఓవ‌ర్ ప్ర‌ధాన హైలైట్‌గా నిలిచింది.

ఆ త‌రువాత ఈ మూవీ నుంచి రామ్‌చ‌ర‌ణ్‌కు సంబంధించిన ఎలాంటి వీడియోగానీ, కొత్త పోస్ట‌ర్‌ని కానీ మేక‌ర్స్ రిలీజ్ చేయ‌లేదు. ఈ నెల 27న రామ్‌చ‌ర‌ణ్ పుట్టిన రోజున కొత్త పోస్ట‌ర్‌ని రిలీజ్ చేస్తున్నార‌ట‌. ఈ విష‌యాన్ని చిత్ర బృందం శ‌నివారం అధికారికంగా ప్ర‌క‌టించింది. ఇందులో రామ్‌చ‌ర‌ణ్ అల్లూరి సీతాక‌రామ‌రాజు పాత్ర‌లో న‌టిస్తున్న విష‌యం తెలిసిందే. ఇప్ప‌టి వ‌ర‌కు ఆ వేష‌ధార‌ణ‌కు సంబంధించిన పోస్ట‌ర్‌ని మేక‌ర్స్ రిలీజ్ చేయ‌లేదు.

- Advertisement -

మార్చి 27న మాత్రం అలాంటి లుక్‌కు సంబంధించిన బ్రాండ్ న్యూ పోస్ట‌ర్‌ని మేక‌ర్స్ రిలీజ్ చేయ‌బోతున్న‌ట్టు తెలిసింది. మ‌న్యం వీరుడు అల్లూరి సీతారామ‌రాజు లుక్‌లో రామ్‌చ‌ర‌ణ్ రోమాంచిత‌మైన లుక్‌లో క‌నిపించ‌బోతున్నాడ‌ట‌. ఈ విష‌యం తెలిసి మెగా ఫ్యాన్స్ పండ‌గ చేసుకుంటున్నారు. కాగా ఈ చిత్రాన్ని అక్టోబ‌ర్ 13న ప్ర‌పంచ వ్యాప్తంగా అత్యంత భారీ స్థాయిలో రిలీజ్ చేయ‌నున్న విష‌యం తెలిసిందే.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All