Homeగాసిప్స్చరణ్ సినిమా కోసం హైదరాబాద్ లో శంకర్

చరణ్ సినిమా కోసం హైదరాబాద్ లో శంకర్

చరణ్ సినిమా కోసం హైదరాబాద్ లో శంకర్
చరణ్ సినిమా కోసం హైదరాబాద్ లో శంకర్

అగ్ర దర్శకుడు శంకర్ కొంత కాలంగా ఫామ్ కోల్పోయాడు అనే చెప్పాలి. అసలు ప్లాప్ అన్నదే ఎరుగని శంకర్ తన సత్తాకు తగ్గ చిత్రాన్ని మాత్రం ఈ మధ్య అందించలేకపోతున్నాడు. భారీ అంచనాల మధ్య తెరకెక్కుతోన్న ఇండియన్ 2 లీగల్ చిక్కుల్లో ఇరుక్కుపోయి ఆగిపోయింది. శంకర్ ఇప్పుడు తన నెక్స్ట్ చిత్రంపై ఫోకస్ పెట్టాడు.

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో శంకర్ పనిచేయనున్న సంగతి తెల్సిందే. టాప్ నిర్మాత దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మించనున్నాడు. ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు ప్రస్తుతం శరవేగంగా జరుగుతున్నాయి. ఇందుకోసమే శంకర్ హైదరాబాద్ చేరుకున్నాడట. నిర్మాతతో షూటింగ్ షెడ్యూల్స్, లొకేషన్స్, కాస్టింగ్ తదితర అంశాల మీద విరివిగా చర్చలు జరుపుతున్నాడట.

- Advertisement -

రికార్డ్ టైమ్ లో ఈ చిత్రాన్ని పూర్తి చేయాలని అనుకుంటున్నాడు శంకర్. థమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తోన్న విషయం తెల్సిందే. సాయి మాధవ్ బుర్రా తెలుగు వెర్షన్ కు డైలాగ్స్ రాయనున్నాడు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All