
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, అగ్ర దర్శకుడు శంకర్ కలిసి ప్యాన్ ఇండియా చేయబోతున్న సంగతి తెల్సిందే. ఈ చిత్ర గురించి మొదట సస్పెన్స్ నెలకొన్నా కూడా ఇప్పుడు ఫుల్ క్లారిటీ వచ్చింది. వచ్చే నెల నుండి ఈ సినిమా మొదలుకానుంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా సాగుతున్నాయి.
మొన్న డైలాగ్ రైటర్ గా సాయి మాధవ్ బుర్రా కన్ఫర్మ్ అయిన విషయం తెల్సిందే. అలాగే నిన్న మెయిన్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ ఖరారయ్యాడు. ఇక ఇప్పుడు తాజా సమాచారం ప్రకారం సంగీత దర్శకుడిగా థమన్ ఓకే అయినట్లు తెలుస్తోంది.
థమన్ ఇప్పుడు టాప్ ఫామ్ లో ఉన్నాడు. వరసగా టాప్ సినిమాలను చేజిక్కించుకుంటున్నాడు. అలాగే ఇప్పుడు శంకర్ – రామ్ చరణ్ చిత్రం కూడా వచ్చింది. ఇప్పటిదాకా రెహమాన్, హారిస్ జయరాజ్, అనిరుధ్ లతో పనిచేసిన శంకర్ తన కెరీర్ లో నాలుగో సంగీత దర్శకుడితో పనిచేస్తున్నాడు. మరిన్ని వివరాలు త్వరలో తెలుస్తాయి.
It gets bigger and better as Music Sensation @MusicThaman joins #RC15
Here’s a sneak peek into the first recording by Thaman and a team of 135 musicians who left @ShankarShanmugh and @AlwaysRamCharan mesmerized.@SVC_official #SVC50 pic.twitter.com/NWbrSd90eF
— Sri Venkateswara Creations (@SVC_official) July 19, 2021