Homeటాప్ స్టోరీస్ష‌‌కీలా బ‌యోపిక్ టీజ‌ర్ వ‌చ్చేసింది!

ష‌‌కీలా బ‌యోపిక్ టీజ‌ర్ వ‌చ్చేసింది!

ష‌‌కీలా బ‌యోపిక్ టీజ‌ర్ వ‌చ్చేసింది!
ష‌‌కీలా బ‌యోపిక్ టీజ‌ర్ వ‌చ్చేసింది!

దక్షిణ భారత చిత్ర పరిశ్రమలో 1990 నుండి 2000 ల మధ్య కాలంలో ష‌కీలా సృష్టించిన హంగామా అంతా ఇంతా కాదు. యావ‌త్ ద‌క్షిణాది చిత్ర ప‌రిశ్ర‌మ‌నే ఓ ఊపు ఊపేసింది. ‌శృంగార తార‌గా వ‌రుస అడ‌ల్ట్ చిత్రాల్లో న‌టిస్తూ స్టార్ హీరోల‌కు కంటి మీద కునుకు లేకుండా చేసింది. ముఖ్యంగా మలయాళంలో మోహన్ లాల్, మమ్ముట్టి వంటి వారిని వెన‌క్కి నెట్టి బాక్సాఫీస్ వద్ద త‌న ఆధిపత్యం చెలాయించి బాక్సాఫీస్ క్వీన్‌గా నిలిచింది.

ష‌కీలా సినిమా రిలీజ్ అయితే మోహన్ లాల్, మమ్ముట్టి వంటి స్టార్‌లు న‌టించిన చిత్రాలు రిలీజై థియేట‌ర్లు జ‌నం లేక బోసిపోయేవంటే ప‌రిస్థితి ఎలా మారిందో అర్థం చేసుకోవ‌చ్చు. ష‌కీలా మేనియా ఎంత‌లా ప్ర‌భావం చూపించిందో దీన్ని బ‌ట్టి అర్థం చేసుకోవ‌చ్చు. ఆమె త‌మ ఉనికినే ప్ర‌శ్నార్థంలో ప‌డేస్తోంద‌ని భావించిన స్టార్ హీరోలు ష‌కీల‌ని త‌మ ఇండ‌స్ట్రీ నుంచి వెళ్ల‌గొట్టేంత‌గా పావులు క‌దిపి చివ‌రికి ఆమెకు సినిమాలు లేకుండా చేశారు. అలాంటి ష‌కీలా జీవిత క‌థ ఆధారంగా రూపొందుతున్న చిత్రం `ష‌కీలా`. బాలీవుడ్ హీరోయిన్ రిచా చ‌ద్దా ఇందులో ష‌కీలాగా న‌టించింది. ఇంద్ర‌జిత్ లంకేష్ ద‌ర్‌శ‌క‌త్వం వ‌హించిన ఈ మూవీ టీజ‌ర్‌ని మేక‌ర్స్ రిలీజ్ చేశారు.  ‌

- Advertisement -

`1990 లలో థియేటర్లు ని నింపాలంటే ఎగ్జిబిటర్లు, పంపిణీదారులకు ఒకే పేరు వి‌నిపించేది అదే ష‌కీలా. క‌రోనా కార‌ణంగా ప్ర‌స్తుతం మూత‌ప‌డిన థియేట‌ర్లు తెరుచుకున్నాక మ‌ళ్లీ ష‌కీలా పేరు వినిపిస్తుంది` అంటూ టీజ‌ర్‌లో థియేట‌ర్ల‌లో  ఖాళీ కూర్చీల విజువ‌ల్స్ నేప‌థ్యంలో వాయిస్ ఓవ‌ర్ వినిపిస్తోంది. టీజ‌ర్‌లో ష‌కీలా న‌టించిన అడ‌ల్ట్ చిత్రాల్లోని స‌న్నివేశాల‌తో పాటు అప్ప‌ట్లో యువ‌త‌లో ష‌కీలా ప‌ట్ల వున్న క్రేజ్‌ని కూడా చూపించే ప్ర‌య‌త్నం చేశారు. టీజర్‌లో ప్రేక్షకులు ఆమెను ఎలా ఆరాధించారో .. అదే సమయంలో ప్రజల ఆగ్రహాన్ని కలిగి వ్య‌క్తం చేయ‌డాన్ని కూడా చూపించారు. ఈ చిత్రం షకీలా ఎలా అడ‌ల్ట్ స్టార్‌గా మారింది. ఆమె కుటుంబ సభ్యులు ఎలాంటి అవ‌మానాలు ఎదుర్కొన్నారు. ఎలాంటి ద్రోహానికి గురైంది చివ‌రికి త‌ను సంపాదించిన‌దంతా ఎలా పోగొట్టుకుంది అన్న ఆస‌క్తికర విష‌యాల్ని ఈ చిత్రంలో చ‌ర్చిస్తున్నారు. క్రిస్మ‌స్ కానుక‌గా డిసెంబ‌ర్ 25న ఈ మూవీ రిలీజ్ కాబోతోంది.

YouTube video

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All