Homeటాప్ స్టోరీస్ష‌కీలా బ‌యోపిక్ అర్థం మారిపోయిందా?

ష‌కీలా బ‌యోపిక్ అర్థం మారిపోయిందా?

ష‌కీలా బ‌యోపిక్ అర్థం మారిపోయిందా?
ష‌కీలా బ‌యోపిక్ అర్థం మారిపోయిందా?

బ‌యోపిక్ అంటే కొంత మంది అర్థాన్ని మార్చేస్తున్నారు. త‌మ‌కు న‌చ్చింది మాత్ర‌మే తెరుపై చూపిస్తూ న‌చ్చ‌ని దాన్ని వ‌దిలేస్తున్నారు. అలా చేయ‌డంతో బ‌యోపిక్ అనే అర్థ‌మే మారిపోతోంది. తాజాగా `ష‌కీలా` బ‌యోపిక్ విష‌యంలోనూ ఇదే జ‌రిగిన‌ట్టు తెలుస్తోంది. ఇంద్ర‌జిత్ లంకేష్ కూడా త‌న‌కు న‌చ్చిన‌ట్టుగా ఈ బ‌యోపిక్‌ని తెర‌పైకి తీసుకొచ్చిన‌ట్టు క‌నిపిస్తోంది. రిచా చ‌ద్దా ప్ర‌ధాన పాత్ర‌లో ఇంద్ర‌జిత్ లంకేష్ తెర‌కెక్కించిన చిత్రం `ష‌కీలా`.

శృంగార తార ష‌కీలా జీవిత క‌థ ఆధారంగా తెర‌కెక్కించిన ఈ చిత్రం వాస్త‌విక అంశాల‌కు దూరంగా ష‌కీలా ఓ శృంగార తార కాదు అని చూపించే ప్ర‌య‌త్నం చేసిన‌ట్టుగా క‌నిపిస్తోంది. ఇటీవ‌ల ఈ చిత్రానికి సంబంధించి టీజ‌ర్‌ని రిలీజ్ చేశారు. తాజాగా ట్రైల‌ర్‌ని వ‌దిలారు. ఇందులో ష‌కీలా శృంగార తార‌గా న‌టించిన స‌న్నివేశాల్లో మ‌రో న‌టిని చూపించిన తీరు ప‌లు అనుమానాల‌కు తావిస్తోంది. కుటుంబ భారం, ఆర్థిక ఇబ్బందుల కార‌ణంగా సినిమాల్లోకి ప్ర‌వేశించిన ష‌కీలా ఆ త‌రువాత శృంగార తార‌గా సాఫ్ట్ పోర్న్ చిత్రాల్లో న‌టించి సంచ‌ల‌నం సృష్టించింది.

- Advertisement -

ఒక ద‌శ‌లో మ‌ల‌యాళ సూప‌ర్‌స్టార్స్ కి కంటిమీద కునుకు లేకుండా చేసింది. అయితే ఆ అంశాల‌ని చ‌ర్చిస్తూనే ష‌కీలా శృంగార తార కాద‌ని ఆమె సాఫ్ట్ పోర్న్ స‌న్నివేశాల్లో న‌టించ‌లేద‌ని చూపించే ప్ర‌య‌త్నం చేశారు ద‌ర్శ‌కుడు ఇంద్ర‌జిత్ లంకేష్‌. ఇదే ఇప్పుడు విమ‌ర్శ‌ల‌కు తావిస్తోంది. ఈ చిత్రాన్ని దేశ వ్యాప్తంగా ప్ర‌ధాన భాష‌ల్లో ఈ నెల 25న క్రిస్మ‌స్ కానుక‌గా విడుద‌ల చేస్తున్నారు. రిలీజ్ త‌రువాత ఈ మూవీపై ఎలాంటి వివాదాలు మొద‌ల‌వుతాయో చూడాలి అంటున్నారు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All