Homeటాప్ స్టోరీస్శైలజారెడ్డి అల్లుడు 11 రోజుల వసూళ్లు

శైలజారెడ్డి అల్లుడు 11 రోజుల వసూళ్లు

shailaja reddy alludu 11 days collectionsఅక్కినేని నాగచైతన్య హీరోగా నటించిన శైలజారెడ్డి అల్లుడు చిత్రానికి రివ్యూస్ అంత గొప్పగా రాలేదు కానీ వసూళ్లు మాత్రం ఫరవాలేదు అనేలా వస్తున్నాయి . సెప్టెంబర్ 13న విడుదలైన శైలజారెడ్డి అల్లుడు చిత్రం మొత్తంగా 11 రోజుల్లో 17. 65 కోట్ల షేర్ ని వరల్డ్ వైడ్ గా సాధించింది . అసలు రివ్యూస్ తో పోల్చితే ఈ వసూళ్లు బ్రహ్మాండం అనే చెప్పాలి . లవ్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన శైలజారెడ్డి అల్లుడు చిత్రానికి మారుతి దర్శకత్వం వహించాడు . నాగచైతన్య సరసన అను ఇమ్మాన్యుయేల్ నటించగా కీలక పాత్రలో అత్తగా రమ్యకృష్ణ నటించింది . నరేష్ , 30 ఇయర్స్ పృథ్వీ , మురళీశర్మ తదితరులు నటించిన ఈ చిత్రానికి గోపిసుందర్ సంగీతం అందించాడు . ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 18 కోట్ల వసూళ్లని సాధించడంతో ఇక బ్రేక్ ఈవెన్ కావాలంటే , బయ్యర్లు లాభాల్లోకి రావాలంటే మరో ఆరు కోట్లు వసూల్ చేయాలి . మరి ఆ వసూళ్లు శైలజారెడ్డి అల్లుడు సాధిస్తాడా ? చూడాలి .

ఏరియాల వారీగా శైలజారెడ్డి అల్లుడు వసూళ్లు ఇలా ఉన్నాయి

- Advertisement -

నైజాం : 4.30 కోట్ల షేర్

సీడెడ్ : 2.72 కోట్లు

ఉత్తరాంధ్ర : 1.73 కోట్లు

ఈస్ట్ : 1.55కోట్లు

వెస్ట్ : 94 లక్షలు

గుంటూరు : 1.35 కోట్లు

కృష్ణా : 1.04 కోట్లు

నెల్లూరు : 62 లక్షలు

రెస్ట్ ఆఫ్ ఇండియా I: 1.80 కోట్లు

ఓవర్ సీస్ : 1.65 కోట్లు

మొత్తం : 17. 65 కోట్ల షేర్

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All