Homeగాసిప్స్అట్లీ మాయలో పడిపోయిన కింగ్ ఖాన్

అట్లీ మాయలో పడిపోయిన కింగ్ ఖాన్

అట్లీ మాయలో పడిపోయిన కింగ్ ఖాన్
అట్లీ మాయలో పడిపోయిన కింగ్ ఖాన్

కింగ్ ఖాన్ అనగానే గుర్తొచ్చే పేరు.. షారుఖ్ ఖాన్. దశాబ్దాలుగా ఎన్నో సూపర్ హిట్ చిత్రాలను, సూపర్ మూమెంట్స్ ను ప్రేక్షకులకు అందించాడు షారుఖ్ ఖాన్. ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ గా కూడా అవతరించాడు. ఎన్నో మరపురాని చిత్రాలను అందించిన షారుఖ్ ఖాన్ గత కొంత కాలంగా బాగా వెనుకబడ్డాడు. గత నాలుగైదేళ్లుగా షారుఖ్ నుండి ఒక్క హిట్ సినిమా కూడా రాలేందంటే పరిస్థితి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. తన సమకాలికులు అయిన సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్ 200 కోట్ల క్లబ్, 300 కోట్ల క్లబ్ అంటూ దూసుకుపోతుంటే షారుఖ్ మాత్రం 100 కోట్ల క్లబ్ లో కూడా స్థానం సంపాదించలేక పూర్తిగా వెనకబడిపోయాడు. యువ హీరోలు కూడా షారుఖ్ ను దాటేసి వెళ్ళిపోయి చాలా కాలమైంది. ఈ దశలో షారుఖ్ పూర్వ వైభవం కోసం చూస్తున్నాడు. కెరీర్ డౌన్ లో ఉన్నప్పుడు సల్మాన్, అమీర్ ఖాన్ చేసిన పనినే ఇప్పుడు షారుఖ్ చేస్తున్నాడు. అదే సౌత్ సినిమాలను నమ్ముకోవడం.

కొన్నేళ్ల క్రితం సల్మాన్ కెరీర్ పూర్తిగా డౌన్ లో ఉన్నప్పుడు చేసిన సినిమా వాంటెడ్. పోకిరి రీమేక్ గా తెరకెక్కిన ఈ చిత్రం సూపర్ డూపర్ హిట్టైంది. అక్కడినుండి సల్మాన్ వెనుతిరిగి చూసింది లేదు. అలాగే అమీర్ కూడా గజిని చిత్రంతో బాలీవుడ్ లో తొలి 100 కోట్ల చిత్రాన్ని నెలకొల్పాడు. ఇప్పుడు షారుఖ్ కూడా సౌత్ సినిమాతో గ్రాండ్ గా హిట్ కొట్టాలని చూస్తున్నాడు. ఇప్పటికే సౌత్ లో సెన్సేషనల్ దర్శకుడు అట్లీను లాక్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. అట్లీ-షారుఖ్ కాంబినేషన్ గురించి గత ఏడాదిగా వార్తలు వస్తూనే ఉన్నాయి. ప్రస్తుతం అట్లీ బిగిల్ చిత్రాన్ని పూర్తి చేసి ఖాళీగా ఉన్న సమయంలో ఇక ఈ సినిమా పట్టాలెక్కడమే తరువాయి అని అంటున్నారు. ఇటీవలే అట్లీ కూడా షారుఖ్ సినిమా గురించి డైరెక్ట్ గా చెప్పకపోయినా ఇన్ డైరెక్ట్ గా చెప్పాడు. మా ఇద్దరి కాంబినేషన్ లో సినిమా ఉండొచ్చని అన్నాడు.

- Advertisement -

తాజాగా వినిపిస్తున్న సమాచారం ప్రకారమైతే షారుఖ్ అట్లీతో మూడు సినిమాల డీల్ మాట్లాడుకున్నాడట. ఇందులో రెండు సినిమాలు షారుఖ్ తో అట్లీ తీస్తాడట. మరొకటి షారుఖ్ నిర్మాతగా అట్లీ దర్శకత్వంలో వేరే హీరోతో ఉంటుందని వార్తలు వస్తున్నాయి. ఈ మూడు చిత్రాలు కూడా షారుఖ్ సంస్థ రెడ్ చిల్లీస్ నిర్మాణ భాగస్వామిగా ఉంటుందని తెలుస్తోంది. మొదటిగా అట్లీ సినిమాల్లోనే ఒక చిత్రాన్ని షారుఖ్ హీరోగా రీమేక్ చేస్తాడని అంటున్నారు. ఈ మేరకు అట్లీతో మూడు సినిమాల అగ్రిమెంట్ ను భారీ రెమ్యునెరేషన్ ఇచ్చి సైన్ చేయించుకున్నట్లు తెలుస్తోంది. అట్లీ ఈ ఆఫర్ కు అడ్వాన్స్ కూడా తీసేసుకున్నాడట. రీసెంట్ గా అట్లీ, అతని భార్య ప్రియా షారుఖ్ ను కలిసి ఈ మేరకు ఒప్పందం చేసుకున్నారు. మరి ఈ సినిమాలతోనైనా షారుఖ్ హిట్ కొట్టి తన పూర్వ వైభవాన్ని చాటుకుంటాడేమో చూడాలి.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All

గాసిప్స్

View All

Latest Posts