Homeటాప్ స్టోరీస్స్టార్ హీరో భార్య ని తిడుతున్నారు

స్టార్ హీరో భార్య ని తిడుతున్నారు

shahid kapoor wife Mira Rajput gets trolled acted anti ageing cream addబాలీవుడ్ స్టార్ హీరో షాహిద్ కపూర్ భార్య ” మీరా రాజ్ పుత్” ని నెటిజన్లు తిడుతున్నారు . పాపం ! మీరా రాజ్ పుత్ చేసిన తప్పు ఏంటంటే ఓ యాడ్ లో నటించడం అంతే! ఇప్పటికే ఓ బిడ్డ కి తల్లై మరో బిడ్డకు జన్మనివ్వ బోతున్నప్పటికీ కూడా ఇంకా అందంగా ఉన్నానంటే దానికి కారణం ” ఓలే ” క్రీమ్ కారణమని మీరా రాజ్ పుత్ చెప్పడమే ! తనలో యవ్వన బిగి సడలకుండా ఉండటానికి ఆ క్రీమ్ కారణమని చెబుతూ షాహిద్ కూడా తన అందానికి మురిసిపోతుంటాడని చెప్పడమే .

ఇంకేముంది నెటిజన్లు మీరా పై ఫైర్ అవుతున్నారు . చర్మ సౌందర్యం కోసం సహజసిద్ధమైన ఉత్పత్తులనే వాడతానని ఇంతకుముందు ఇంటర్వ్యూ లలో చెప్పావ్ ! ఇప్పుడేమో ఆ మాట తప్పావ్ ! నువ్ నయవంచకురాలివి . ఇలాంటి ఉత్పత్తులకు ప్రచారం కల్పించినందుకు మిమ్మల్ని చూసి సిగ్గుపడుతున్నాం అంటూ ఓ నెటిజన్ కామెంట్ చేయగా మరొకరు యాంటీ ఏజింగ్ క్రీమ్ కు ప్రచారం చేయడం ఏంటి నాన్సెన్స్ అంటూ మరొకరు ఆగ్రహం వ్యక్తం చేసారు . మీరా రాజ్ పుత్ ఏ ఉద్దేశ్యంతో ఆ వీడియో ని పోస్ట్ చేసిందో కానీ నెటిజన్లు మాత్రం తమ ఆగ్రహాన్ని ప్రదర్శించారు స్టార్ హీరో భార్య పై .

- Advertisement -

English Title: shahid kapoor wife Mira Rajput gets trolled acted anti ageing cream add

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All