
తెలుగులో బిగ్ బాస్ రెండు సీజన్ లు పూర్తిచేసుకుంది అయితే ఇప్పుడు మూడో సీజన్ లో వివాదాస్పద భామ శ్రీ రెడ్డి పాల్గొంటున్నట్లు తెలుస్తోంది . అసలు ఈ భామని రెండో సీజన్ లోనే ఎంపిక చేసారు కానీ ఆ రెండో సీజన్ కు వ్యాఖ్యాతగా వ్యవహరించింది హీరో నాని కాబట్టి ఆ లిస్ట్ లోంచి శ్రీ రెడ్డి పేరు తొలిగిపోయింది . కానీ ఇప్పుడు మూడో సీజన్ లో మాత్రం శ్రీ రెడ్డి ని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది .
- Advertisement -
ఒకవేళ శ్రీ రెడ్డి కనుక తెలుగు బిగ్ బాస్ 3 లో ఉంటే ఇక రచ్చ రచ్చే ! అసలే హాట్ భామ ఆపై వివాదాల భామ ఇంకేముంది బిగ్ బాస్ షోని చీల్చి చెండాడటం ఖాయం . పైగా మన్మథుడు నాగార్జున ఈ బిగ్ బాస్ 3 కి హోస్ట్ గా వ్యవహరిస్తున్నాడు కాబట్టి తన కంట్రోల్ లోనే షో నడుస్తుంది కానీ మిగతా రోజుల్లో మాత్రం శ్రీ రెడ్డి ఇతరులకు చుక్కలు చూపించడం ఖాయం .
- Advertisement -