Homeటాప్ స్టోరీస్మొదటిసారి కమ్ముల ట్రై చేస్తున్నాడు.. వర్కౌట్ అవుతుందా?

మొదటిసారి కమ్ముల ట్రై చేస్తున్నాడు.. వర్కౌట్ అవుతుందా?

మొదటిసారి కమ్ముల ట్రై చేస్తున్నాడు.. వర్కౌట్ అవుతుందా?
మొదటిసారి కమ్ముల ట్రై చేస్తున్నాడు.. వర్కౌట్ అవుతుందా?

ప్రస్తుతం నాగ చైతన్య వెంకీ మామ సినిమా రిలీజ్ కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నాడు. భారీ బడ్జెట్ పెట్టడం, వెంకటేష్ తో కలిసి తొలిసారి పూర్తి స్థాయి సినిమా చేయడం, అందులోనూ సురేష్ ప్రొడక్షన్స్ స్వయంగా నిర్మించడం… ఈ ఫ్యాక్టర్స్ అన్నిటితో ఈ సినిమా కచ్చితంగా హిట్ అవ్వాలనే కసితో ఉన్నాడు నాగ చైతన్య. డిసెంబర్ 13న వెంకీ మామ భారీ ఎత్తున విడుదల కాబోతోంది. చాలా కాలం తర్వాత ఒక పెద్ద సినిమా రానుండడంతో అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇది పక్కనపెడితే నాగ చైతన్య వెంకీ మామ పూర్తైన వెంటనే శేఖర్ కమ్ములతో సినిమాను మొదలుపెట్టేశాడు.

నిజానికి ఫిదా తర్వాత శేఖర్ కమ్ముల మొత్తం కొత్త వాళ్లతో ఒక సినిమాను మొదలుపెట్టాడు. షూటింగ్ కూడా దాదాపు పూర్తయిందన్న తరుణంలో ఈ సినిమా కాపీని చూసుకున్న కమ్ముల బాలేదని చెప్పి మొత్తం స్క్రాప్ చేసేసాడు. అప్పుడు పేరున్న నటుడిని, నటిని దృష్టిలో పెట్టుకుని ఈ కథనే మార్పులు చేయడం మొదలుపెట్టాడు. శేఖర్ కమ్ముల సినిమాలు అంటే కొత్తగా చెప్పేదేముంది. హీరోయిన్ సెంట్రిక్ గా సాగుతాయి. హీరో ఎలాంటి వాడైనా హీరోయిన్ ఇందులో లీడ్ తీసుకుంటుంది. ఆనంద్, గోదావరి, ఫిదా ఇలా ఏ సినిమా తీసుకున్నా హీరోయిన్ కి బలమైన క్యారెక్టర్ లు రాయడంలో కమ్ముల సిద్ధహస్తుడు. అలాగే తన కొత్త ప్రాజెక్ట్ లో కూడా హీరోయిన్ సెంట్రిక్ గా కథ రాసుకుంటుండగా నాగ చైతన్య తన సినిమాలో నటించడానికి ఆసక్తి చూపిస్తున్నాడని తెలిసింది.

- Advertisement -

నాగ చైతన్య స్వయంగా ముందుకు రావడంతో శేఖర్ కమ్ముల కథలో మార్పులు చేయడం మొదలుపెట్టాడు. తొలిసారి శేఖర్ హీరోని దృష్టిలో ఉంచుకుని కథ రాస్తున్నాడు. హీరో పాత్ర హీరోయిన్ కు, హీరోయిన్ పాత్ర హీరోకు షిఫ్ట్ చేసాడు. అలా అని చెప్పి ఇందులో హీరోయిన్ గా నటిస్తున్న సాయి పల్లవి పాత్ర తక్కువగా ఉంటుందని అనుకోవడానికి లేదు. ఆమె పాత్ర కూడా బలంగానే ఉంటుంది. కాకపోతే తొలిసారి శేఖర్ కమ్ముల హీరోని దృష్టిలో పెట్టుకుని కథ సిద్ధం చేసాడు. ఫిదా తరహాలో మొత్తం హీరోయిన్ సినిమాను కమ్మేసేలా ఉండదు. ఇప్పటికే షూటింగ్ లో రెండు షెడ్యూల్స్ పూర్తయ్యాయి. ఈ సినిమాను ఏప్రిల్ 2న విడుదల చేయాలనీ భావిస్తున్నారు. లవ్ స్టోరీ అనే టైటిల్ ను కన్సిడర్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. మార్చ్ ఫస్ట్ వీక్ కల్లా షూటింగ్ పూర్తయ్యేలా ప్లాన్ చేసాడు కమ్ముల.

ఇప్పటికే నాగ చైతన్య పుట్టినరోజుకి విడుదల చేసిన చిన్న టీజర్ ఆహ్లాదంగా అనిపించింది. నాగ చైతన్య పాత్ర చాలా సింపుల్ అండ్ స్వీట్ అని ఆ వీడియో చూస్తే అర్ధమైపోతుంది. మరి మజిలీతో సూపర్ హిట్ అందుకున్న నాగ చైతన్య వెంకీ మామ, శేఖర్ కమ్ముల లవ్ స్టోరీతో ఎలాంటి ఫలితాల్ని అందుకుంటాడో చూడాలి. శేఖర్ కమ్ముల ఈ సినిమా నిర్మాణంలో భాగం పంచుకుంటుండడం విశేషం.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All