Homeటాప్ స్టోరీస్మూవీ రివ్యూ : సీటిమార్

మూవీ రివ్యూ : సీటిమార్

Seetimaarr Movie Telugu Review
Seetimaarr Movie Telugu Review

నటీనటులు: గోపీచంద్, తమన్నా, భూమిక చావ్లా, పోసాని కృష్ణ మురళి, రావు రమేష్ తదితరులు
దర్శకుడు: సంపత్ నంది
నిర్మాత: శ్రీనివాస చిట్టూరి
సంగీత దర్శకుడు: మణిశర్మ
రేటింగ్ : 2.75/5

వరసగా ప్లాపులతో సతమతమవుతోన్న గోపీచంద్, తనతోనే గౌతమ్ నంద వంటి ప్లాప్ ఇచ్చిన సంపత్ నందితో మరోసారి చేసిన సినిమా సీటిమార్. కబడ్డీ నేపథ్యంలో యాక్షన్ ఎంటర్టైనర్ గ్గా రూపొందించిన ఈ చిత్రం వినాయక చవితి సందర్భంగా ఈరోజే విడుదలైంది. మరి ఈ సినిమా ఎలా ఉందో చూద్దామా.

- Advertisement -

కథ:
అసిస్టెంట్ బ్యాంక్ మేనేజర్ గా పనిచేసే కార్తీక్ (గోపీచంద్) ఆంధ్రప్రదేశ్ మహిళల టీమ్ కు కోచ్ గా వ్యవహరిస్తుంటాడు. అతికష్టమ్మీద మహిళల జట్టుని నేషనల్ కబడ్డీ ఛాంపియన్ షిప్ కోసం ఢిల్లీ తీసుకెళతాడు. అయితే అనుకోకుండా తన కుటుంబం కారణంగానే ఆ జట్టు మొత్తం కిడ్నప్ కు గురవుతుంది.

అసలు మహిళల కబడ్డీ జట్టుకి కార్తీక్ కుటుంబానికి సంబంధం ఏంటి? కార్తీక్ ను టార్గెట్ చేస్తోంది ఎవరు? కార్తీక్ ఈ ఇబ్బందులను ఎలా ఛేదించాడు, దానికి జ్వాలా రెడ్డి (తమన్నా) ఎలా సహాయపడింది అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

నటీనటులు:
గోపీచంద్ మాస్ పాత్రలో చెలరేగిపోయాడు. తనకు నప్పిన జోనర్ కావడంతో చాలా సులువుగా తన పాత్రను చేసుకుంటూ వెళ్ళిపోయాడు. కొన్ని చోట్ల కళ్ళతోనే ఎమోషన్ ను పలికించిన విధానం హైలైట్ గా నిలిచింది. ఇక తమన్నా కూడా మంచి పాత్ర చేసింది. ఆమె డైలాగులు, బాడీ లాంగ్వేజ్ సరిగ్గా సరిపోయాయి. భూమిక పాత్ర బాగుంది కానీ ఆమె ఒకేరకమైన పాత్రలతో స్టీరియోటైప్ అవుతుందేమో అనిపిస్తుంది.

మహిళల కబడ్డీ టీమ్ గా కనిపించిన అమ్మాయిలు కూడా బాగా చేసారు. మెయిన్ విలన్ గా నటించిన తరుణ్ అరోరా తన పాత్రకు న్యాయం చేసాడు. మిగిలిన వాళ్లంతా మాములే.

సాంకేతిక నిపుణులు:
ముందుగా సినిమా నిర్మాణ విలువలు టాప్ స్థాయిలో ఉన్నాయి. కెమెరా పనితనం కూడా అద్భుతంగా ఉంది. యాక్షన్ సన్నివేశాల్లో, కబడ్డీ సన్నివేశాల్లో కెమెరా వర్క్ సూపర్బ్. ఎడిటింగ్ పర్వాలేదు. మణిశర్మ సంగీతం, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగున్నాయి.

సంపత్ నంది మరోసారి మాస్ కథతో వచ్చాడు.  కమర్షియల్ ఫార్మాట్ లో అటు యాక్షన్ ను ఇటు స్పోర్ట్స్ ను మిక్స్ చేసిన విధానం బాగుంది. సరైన కమర్షియల్ ఎలిమెంట్స్ సెట్ చేయడంలో సక్సెస్ అయ్యాడు సంపత్ నంది.

చివరిగా:
గోపీచంద్ నుండి చాలా కాలం తర్వాత ఒక మంచి చిత్రం వచ్చింది. పండగ సీజన్ కూడా కలవడంతో సీటిమార్ విజయానికి అడ్డంకులు ఏం లేవు. సీటిమార్ – గట్టిగా మోగింది. సెకండ్ హాఫ్ లో కొంత డ్రాగ్ తప్పితే సీటిమార్ కు వంకలు పెట్టడానికంటూ ఏం లేదు. మాస్ ప్రేక్షకులకు సరిగ్గా సెట్ అయ్యే చిత్రమిది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All