Homeటాప్ స్టోరీస్కేసీఆర్ భవితవ్యం తేల్చనున్న సీమాంధ్రులు

కేసీఆర్ భవితవ్యం తేల్చనున్న సీమాంధ్రులు

Seemandhra people decide factor to kcr futureతెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి భవితవ్యం ఏంటో రాబోయే ఎన్నికల్లో తేల్చనున్నారు సీమాంధ్రులు . కేసీఆర్ భవితవ్యాన్ని సీమాంధ్రులు తేల్చడం ఏంటి ? అని అనుకుంటున్నారా ? గ్రేటర్ హైదరాబాద్ లో దాదాపు 28 నియోజకవర్గాల్లో సీమాంధ్రుల ఓట్లు గణనీయంగా ఉన్నాయి . పాతబస్తీ లోని ఏడెనిమిది నియోజకవర్గాలను పక్కన పెడితే మిగతా 20 నియోజకవర్గాల్లో సీమాంధ్రుల ఓట్లు కీలకం కానున్నాయి . తెలంగాణ లోని సీమాంధ్రులు టీఆర్ఎస్ కు ఓటు వేయాలని అనుకుంటే తెలంగాణ రాష్ట్ర సమితి మళ్ళీ అధికారంలోకి రావడం ఖాయం . ఒకవేళ సీమాంధ్రులు టీఆర్ఎస్ కు వ్యతిరేకంగా ఓటు వేయాలని అనుకుంటే కాంగ్రెస్టీడీపీ లకు ఓట్లు వేస్తే తప్పకుండా కేసీఆర్ కు ఇబ్బందే !

సీమాంధ్రులలో కొంతమంది నేరుగా కేసీఆర్ ప్రభుత్వానికి మద్దతు ఇస్తుండగా , మరికొంతమంది వ్యతిరేకిస్తున్నారు అలాగే ఇక పెద్ద సంఖ్యలో ఓటుతో మాత్రమే సమాధానం చెప్పాలని చూస్తున్నారు . దాంతో గ్రేటర్ లోని నియోజకవర్గాల్లో సీమాంధ్రులు ఎవరికి ఓటు వేయాలని నిర్ణయించుకుంటే వాళ్ళు గెలవడం ఖాయం . వంద సీట్లు గెలుస్తామని , మళ్ళీ అధికారం చేపడతామని చెబుతున్న కేసీఆర్ మళ్ళీ అధికారంలోకి రావాలంటే మాత్రం సీమాంధ్రుల ఓట్లు గెల్చుకోవాల్సిన అవసరం అయితే ఉంది . అయితే బల్దియా ఎన్నికల్లో గెలిచినంత ఈజీ అయితే కాదు తెలంగాణ రాష్ట్ర సమితికి . ఎందుకంటే ఇవి సాధారణ ఎన్నికలు . అలాగే ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా రాలేదని అందుకు తెలంగాణ ప్రభుత్వం కూడా కారణమని , ఆంధ్రులను మోసం చేసిన మోడీతో కేసీఆర్ అంటకాగుతున్నాడని ఆగ్రహంగా ఉన్నారు మరి సీమాంధ్రులు .

- Advertisement -

English Title: Seemandhra people decide factor to kcr future

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All